బాలుడు తప్పిపోయాడని గాలింపు
పోలీసులకు ఫిర్యాదు
గుర్తుతెలియని వ్యక్తులు
కిడ్నాప్ చేశారంటున్న బాలుడు
ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు
కంగ్టి, న్యూస్‌లైన్:
అదృశ్యమైన ఓ బాలుడు అట్ట పెట్టెలో ప్రత్యక్షమయ్యాడు. అప్పటివరకు ఆందోళన చెందిన కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రమైన కంగ్టిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కంగ్టికి చెందిన ఈశ్వర్, రత్నమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్(11) శనివారం బడికి పోకుండా ఇంటి వద్దనే ఉన్నాడు. సాయంత్రం పూట ఆడుకునేందుకు ఊరి బయట తోటి పిల్లలతో వెళ్లాడు. అంతే, బాలుడు ఇంటికి తిరిగా రాలేడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందాడు. కుంటుంబీకులు, బంధువులు శనివారం రాత్రంతా వెతకారు. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న తమ పశువుల కొట్టంలో కూడా చూశారు. రాత్రి బాగా వర్షం పడటంతో వెతికేందుకు వర్షంలో తడుస్తూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. తెల్లారి ఆదివారం చుట్టు పక్క గ్రామాల్లోని తమ బంధువుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. బాలుడి ఫోటోలు తీసి కనుబడట లేదని బస్సులకు, ఆటోలకు పోస్టర్లు అతికించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కంగ్టి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. నవీన్ సోదరుడు ప్రవీణ్ మధ్యాహ్నం ఒంటి గంటకు తమ పశువుల కొట్టం వైపు వెళ్లగా అక్కడ ఏదో శబ్దం విని చూడటంతో అట్టపెట్టెలో కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపి నవీన్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో బాలుడు స్పృహలో లేడు. కొద్దిసేపు అయ్యాక నవీన్ స్పృహలోంచి కోలుకొని లేచాడు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు జీన్స్ పాయింట్, తెల్ల చొక్క ఉండగా క్రీం కలర్ పాయింట్ వేసి ఉండటంతో కుటుంబీకులు అవాక్కయ్యారు. అనంతరం ఆ బాలుడ్ని ఆరా తీశారు.
ఐద్గురు వ్యక్తులు కారులో తీసుకెళ్లారు
శనివారం సాయంత్రం పొద్దుపోయే వేళ ఆడుకుంటుండగా ఐదుగురు వ్యక్తులు ముఖానికి వస్త్రం కట్టుకొని వచ్చి ఓమిని కారులోకి లాక్కోన్ని వెళ్లారని బాలుడు నవీన్ తెలిపారు. అంతలోనే ఎడుపు, అరుపులు పెట్టగానే ముక్కుపై రుమాల్ పెట్టారని, ఆ తర్వాతా ఏమైందో తెలియదని నవీన్ వివరించారు. బాలుగు సజీవంగా కనిపించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన వాస్తవాలను బాలుడి తండ్రి ఈశ్వర్ స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌ను కలిసి వివరించారు. ఇచ్చిన ఫిర్యాదును తిరిగి తీసుకున్నారు. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్త చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు పోలీసులకు కోరారు.
అదృశ్యమై..అట్టపెట్టెలో..
Published Sun, Mar 9 2014 10:20 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement