కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద శనివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.
కొండపల్లి : కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద శనివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విజయవాడ నుంచి తిరువూరు వెళుతున్న తిరువూరు డిపో బస్సు, మైలవరం నుంచి విజయవాడకు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు (350వ నెంబర్ సిటీ బస్సు) ఢీకొన్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.