పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో దాన్ని తట్టుకోడానికి, వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు సీట్లు కేటాయించడానికి వీలుగా 1600 అదనపు బెర్తులు చేరుస్తున్నారు. రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు తగిలించడం ద్వారా ఇవి అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏసీ త్రీటైర్ బోగీలను అదనంగా చేర్చడం ద్వారా ప్రయాణికులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తున్నారు. రైళ్ల వివరాలు ఇవీ..
సికింద్రాబాద్- రాజ్కోట్ (నెం.17018): దీనికి ఈనెల 9, 11, 12, 16, 18, 19, 23, 25, 26, 30 తేదీల్లో అదనపు బోగీలు తగిలిస్తారు.
రాజ్కోట్-సికింద్రాబాద్ (నెం.17017): దీనికి ఈనెల 11, 13, 14, 18, 20, 21, 27 28 తేదీల్లోను, డిసెంబర్ రెండో తేదీన అదనపు బోగీలు ఉంటాయి.
సికింద్రాబాద్- సాయినగర్ షిర్డీ (నెం.17002): వారానికి రెండురోజులు నడిచే ఈ రైలుకు ఈనెల 15, 22, 29 తేదీల్లో అదనపు ఏసీ త్రీటైర్ బోగీ ఒకటి వస్తుంది.
సాయినగర్ షిర్డీ- సికింద్రాబాద్ (నెం.17001): వారానికి రెండురోజులు నడిచే ఈ రైలుకు ఈనెల 16, 23, 30 తేదీల్లో అదనపు ఏసీ త్రీటైర్ బోగీ ఉంటుంది.