18 పరీక్ష కేంద్రాల మార్పు
18 పరీక్ష కేంద్రాల మార్పు
Published Fri, Mar 7 2014 2:33 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :అనుమతి లేకుండా కళాశాలలను తరలించిన కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై ఇంటర్మీడియెట్ బోర్డు ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. నిబంధనలను తుంగలో తొక్కి సంవత్సరాల తరబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఫలితంగా జిల్లాలోని 18 ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల పరిధిలో పరీక్ష కేంద్రాలను శాశ్వతంగా రద్దు చేస్తూ బోర్డు ఉన్నతాధికారులు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. బోర్డు తీసుకున్న నిర్ణయంతో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దశాబ్దాల తరబడి ఏక చత్రాధిపత్యం సాగిస్తున్న కళాశాలలను పక్కన పెట్టి నూతనంగా స్థాపించిన జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా లక్ష మంది వి ద్యార్థులు హాజరుకానుండగా ఇంటర్‌బోర్డు అధికారులు 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అనుమతి లేకుండా కళాశాలల తరలింపు
కార్పొరేట్ కళాశాలలు ఇంటర్ బోర్డు నుంచి ఎక్కడైతే గుర్తింపు పొందారో అక్కడ కాకుండా మరో చోట కొనసాగుతుండగా, హాల్ టిక్కెట్లు మాత్రం పాత చిరునామాతోనే జారీ అవుతున్నాయి. ఉదాహరణకు గుంటూరు నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల, అరండల్ పేట పేరుతో విద్యార్థులకు ప్రతియేటా హాల్ టికెట్లు జారీ అవుతున్నాయి. అయితే అరండల్‌పేటలో అసలు ఆ పేరుతో పరీక్ష కేంద్రం లేకపోవడం, పరీక్ష కేంద్రం కోడ్ నంబర్‌తో విద్యానగర్‌లో కొనసాగడం వంటి సంఘటనలున్నాయి. హాల్ టికెట్లు పొందిన విద్యార్థులు చిరునామా ఆధారంగా కేంద్రాన్ని వెతకడం, పరీక్షకు రెండు రోజుల ముందుగా జిల్లాలో పలు కేంద్రాల చిరునామా మారిందంటూ ఇంటర్ బోర్డు అధికారులు పత్రికా ప్రకటనలు చేయడం ప్రతి యేటా జరుగుతున్న తంతు. దీంతో హాల్ టికెట్లు పొందిన విద్యార్థులు పరీక్ష జరిగే రోజున కేంద్రాల చిరునామా తెలియక ఆందోళనకు గురికావడం, సరైన చిరునామా తెలుసుకుని వెళ్ళే సరికి ఆలస్యం కావడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.
యాజమాన్యాలకు షాక్ ...
కార్పొరేట్ కళాశాలల ఆగడాలపై ప్రేక్షక పాత్ర పోషిస్తూ వచ్చిన ఇంటర్‌బోర్డు ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. అనుమతి లేకుండా తరలించిన కళాశాలలను పక్కనపెట్టి, ఆయా క్యాంపస్‌ల పరిధిలో ఈ దఫా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం నిలిపివేసింది. బోర్డు నుంచి గుర్తింపు పొందిన సమయంలో ఎక్కడైతే కళాశాలలు కొనసాగుతున్నాయో, ప్రస్తుతం అదే చిరునామాలో కళాశాలలు కొనసాగుతున్నదీ లేనిది పరిశీలించి హాల్ టికెట్లు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ప్రతియేటా అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించింది. జిల్లా వ్యాప్తంగా 18 కళాశాలల పరిధిలో పరీక్ష కేంద్రాలను రద్దు చేయగా, వీటిని ఇప్పటి వరకు పరీక్ష కేంద్రాలుగా గుర్తించని మరో 18 కళాశాలల్లో ఏర్పాటు చేస్తూ హాల్ టికెట్లు జారీ చేసింది. వీటిలో గుంటూరు నగరంలో 11, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరో ఏడు కేంద్రాలు ఉన్నాయి.
నూతనంగా ఏర్పాటు చేసిన
పరీక్ష కేంద్రాలు ఇవే..
గుంటూరు నగర పరిధిలో..
= వీఎన్ సైన్స్ అండ్ ఆర్ట్స్ జూనియర్
కళాశాల, రింగ్ రోడ్డు
(పరీక్ష కేంద్రం కోడ్: 06017)
= జాయ్‌సీ మేయర్ జూనియర్ కళాశాల,
(కోడ్: 06026), మహాత్మాగాంధీ కళాశాల పక్కన, సీతమ్మకాలనీ, 5వ లైను
= } వేంకటేశ్వర జూనియర్ కళాశాల, 6/14 బ్రాడీపేట (కోడ్: 06030)
= యాదవ జూనియర్ కళాశాల,
పాత గుంటూరు (కోడ్: 06043)
= ఎస్‌పీ గౌతమ్ జూనియర్ కళాశాల,
రింగ్‌రోడ్డు (కోడ్: 06058)
= మట్టుపల్లి జూనియర్ కళాశాల,
3/7 బ్రాడీపేట (కోడ్: 06071)
= భాష్యం ఐఐటీ జూనియర్ కళాశాల,
గోరంట్ల (కోడ్: 06074)
= }మేధ జూనియర్ కళాశాల,
4/15 బ్రాడీపేట (కోడ్: 06085)
= ఫ్యూచర్ ఫోకస్ మహిళా జూనియర్ కళాశాల, నల్లపాడు (కోడ్: 06108)
= }Mృష్ణ జూనియర్ కళాశాల, పొన్నూరు రోడ్డు (కోడ్: 06121)
= మాగ్నజీల్ కామర్స్ జూనియర్
కళాశాల, 3/1 బ్రాడీపేట (కోడ్: 06126)
రూరల్ పరిధిలో...
= ఎడ్యుకేర్ జూనియర్ కళాశాల, నరసరావుపేట (పరీక్ష కేంద్రం కోడ్: 06102)
= మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల,
{Mోసూరు (కోడ్: 26012)
= మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల,
చీకటీగలపాలెం (వినుకొండ)
(కోడ్: 26021)
= నెహ్రూనికేతన్ జూనియర్ కళాశాల,
బోస్ రోడ్డు, తెనాలి (కోడ్: 26141)
= ఎన్నారై జూనియర్ కళాశాల,
రైల్వేస్టేషన్, తెనాలి (కోడ్: 26149)
= {పభుత్వ జూనియర్ కళాశాల,
దుర్గి (కోడ్: 26225)
= శాంతినికేతన్ జూనియర్ కళాశాల,
సత్తెనపల్లి (కోడ్: 26258)
Advertisement