హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. రామకుప్పం హెలీప్యాడ్ వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వాహనాలు ఢీకొన్నాయి.
చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని, తంబళ్లపల్లి ఎమ్యెల్యే వాహనం ఢీ కొంది. ఈ సంఘటనలో సత్యేవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వాహనం ధ్వంసమైంది. కాగా తలారి ఆదిత్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లడంతో ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చారు.
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల వాహనాల ఢీ
Published Mon, Jun 16 2014 1:26 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement