తూర్పుగోదావరి జిల్లాలో వడదెబ్బ వల్ల మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో వడదెబ్బ వల్ల మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన కూలీ పెదపాటి నాగభూషణం(45) ఎండవేడిమికి తాళలేక శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా అర్ధరాత్రి మృతి చెందాడు. మరో ఘటనలో వాకపల్లి గ్రామానికి చెందిన ఉద్దండు రంగ(35) టైలర్‌గా జీవనం సాగిస్తుండగా... ఇతడు శుక్రవారం పనిమీద వేరు ఊరికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంగ మృతి చెందాడు.