కర్నూలు : కర్నూలు పట్టణం శివారులోని అమీన్ హైదర్‌ఖాన్ కాలనీలో ముళ్ల కంపల్లో దాచి ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ దుంగలను అహోబిలం అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాచి, ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నంలో ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కిరణ్‌కుమార్ వీటిని హైదరాబాద్‌లో కిషోర్‌బాబు అనే వ్యక్తికి అందిస్తే, అతడు ఢిల్లీ పంపించేందుకు పథకం రచించినట్టు పోలీసులు వెల్లడించారు.