ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కష్టాలు తొలగాయి. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. 20 ఏళ్ల అనంతరం బేలలోని బస్టాండ్(పాతబస్టాండ్)కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యూరుు. అసౌకర్యాలు.. అపరిశుభ్రతతో శిథిలావస్థకు చేరి బస్టాండ్ నిరుపయోగంగా మారడంపై ఈ నెల 10న ‘సాక్షి’లో ‘ఒంటికి.. రెంటికి చోటేది?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ పాలకవర్గం, స్థానికులు బస్టాండ్‌లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి సొబగులు అద్దడంతో బుధవారం బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యూరుు. దీంతో మండలవాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
బేల, న్యూస్‌లైన్ :
మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్టాండ్‌ను 1989లో ప్రారంభించగా నాలుగేళ్లపాటు బస్సుల రాకపోకలు సాఫీగా సాగారుు. ఆ తర్వాత వివిధ సమస్యలు సాకుగా చూపి బస్సులు బస్టాండ్ వరకు రాకుండా స్థానిక ఇందిరా చౌరస్తాలో ఆపుతూ ప్రయూణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ చౌరస్తాలో కనీస సౌకర్యాలు లేక ప్రయూణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం, స్థానికులు స్పందించారు. వారం రోజులపాటు బస్టాండ్ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించారు. యూత్ సభ్యులు మరమ్మ తు పనులు చేపట్టారు.
ఆవరణ, బస్టాండ్ షెడ్లను శుభ్రం చేశారు. పునఃప్రారంభం కోసం ఆర్టీసీ అధికారులకు విన్నవించడంతో వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సులను అలంకరించి బ్యాండ్ మేళాల మధ్య పంచాయతీ పాలకవర్గం, వివిధ యూత్ క్లబ్‌ల సభ్యులు బస్టాండ్‌కు తీసుకొచ్చా రు. బస్టాండ్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే, ఆర్టీసీ ఇన్‌చార్జి డీఎం శివ కేశ వ్, సర్పంచ్ మస్కే తేజ్‌రావు జెండా ఊపి బస్సుల రాకపోకలు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎని మిది రోజుల్లోగా బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణాలు ప్రా రంభిస్తామని చెప్పారు. బస్టాండ్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూస్తానన్నారు. ఎస్సై దేశ్‌కార్ లక్ష్మణ్, డిపో అసిస్టెంట్ మేనేజర్ జాకబ్, డిపో ఎస్సై రాములు, ఉప సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రావుత్ మనోహర్, మాజీ సర్పంచ్ ఓల్లఫ్‌వార్ దేవన్న, జన చైతన్య సంఘం అధ్యక్షుడు ముక్కవార్ కిరణ్, బీజేవైఎం అధ్యక్షుడు గుండవార్ ఆకాష్, తెలంగాణ జాగృతి కమిటీ అధ్యక్షుడు షకీల్‌ఖాన్, సర్పంచులు శంకర్, రూప్‌రావు, బాపురావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు క్యాతం రాఘవులు, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కాగా, సమస్యను స్థానికుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి స్థానిక ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
20 ఏళ్లకు బస్‘స్టాండ్’
Published Thu, Dec 26 2013 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement