21 మంది తహశీల్దార్ల బదిలీ
చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లాలో 21 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం కలెక్టర్ రఘునందనరావు ఉత్తర్వులు జారీ చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కలెక్టరేట్‌లోని ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్‌ను విజయవాడ రూరల్ మండలానికి, బి-సెక్షన్ సూపరింటెండెంట్ కె.అనిల్‌జెన్నీసన్‌ను జగ్గయ్యపేట మండలానికి, సి-సెక్షన్ సూపరింటెండెంట్ సుధారాణిని జి.కొండూరు మండలానికి, సెక్రటేరియట్ నుంచి జిల్లాకు కేటాయించిన నూకరాజును చల్లపల్లి మండలానికి, మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయ ఏవో బిక్షారావును రెడ్డిగూడెం మండలానికి, విజయవాడ డ్వామా కార్యాలయంలో తహశీల్దార్‌గా పనిచేస్తున్న షాకీరున్నీసాబేగంను చాట్రాయి మండలానికి బదిలీ చేశారు. అదేవిధంగా విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏవో జయశ్రీని చందర్లపాడు మండలానికి, వీరులపాడు తహశీల్దార్ ప్రసన్నలక్ష్మిని నందిగామ మండలానికి, విజయవాడ డీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న రాజకుమారిని వీరులపాడు మండలానికి, కలెక్టరేట్‌లోని హెచ్-సెక్షన్‌లో పనిచేస్తున్న బాబూరావును ఘంటసాల మండలానికి బదిలీ చేశారు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయ కెఆర్‌ఆర్‌సి తహశీల్దార్ డి.కోటేశ్వరరావును కలెక్టరేట్‌లోని బి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా, చందర్లపాడు తహశీల్దార్ బీఎస్ శర్మను సి-సెక్షన్ సూపరింటెంటెంట్‌గా, నందిగామ తహశీల్దార్ ఎన్‌సీహెచ్ నాగేశ్వరరావును ఈ-సెక్షన్ సూపరింటెండెంట్‌గా, వత్సవాయి మండల తహశీల్దార్ కె.మైనర్‌బాబును హెచ్-సెక్షన్ సూపరింటెండెంట్‌గా, తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన బి.శ్రీనునాయక్‌ను వత్సవాయి మండలానికి, తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన షేక్ లతీఫ్‌పాషాను బందరు కెఆర్‌ఆర్‌సీ తహశీల్దార్‌గా, చల్లపల్లి తహశీల్దార్ స్వర్ణమేరిని ఆర్డీవో కార్యాలయ ఏవోగా, చాట్రాయి తహశీల్దార్ బి.తిరుమలరావును విస్సన్నపేట డీఆర్డీఏ ఏరియా కో-ఆర్డినేటర్‌గా, విస్సన్నపేట ఏరియా కో-ఆర్డినేటర్ డి.గిడియోన్‌ను డీఆర్డీఏ ఏపీవోగా, రెడ్డిగూడెం తహశీల్దార్ ఎం.పద్మకుమారిని నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కెఆర్‌ఆర్‌సీ తహశీల్దార్‌గా, జి.కొండూరు తహశీల్దార్ వి.చంద్రశేఖర్‌ను కలెక్టరేట్‌లోని ఎల్‌ఏపీడబ్ల్యూడీ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూలో బదిలీల కోలాహలం
విజయవాడ : రెవెన్యూ శాఖలో బదిలీల కోలాహలం మెదలైంది. బుధవారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి బదిలీలను నిర్వహించారు. జిల్లాలో 50 మండలాలకు సంబంధించి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 47 మంది సీనియర్ అసిస్టెంట్లు, 36మంది ఆర్‌ఐలను కౌన్సెలింగ్‌కు పిలిచారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 36మందిని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బదిలీ చేశారు. అదే విధంగా 47 మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా బదిలీ చేశారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా అందరినీ పిలిచి బదిలీల ప్రకియను పూర్తి చేశారు.