చిత్తూరు (ఎర్రావారిపాలెం) : చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని తలకోన అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు.
అటవీ ప్రాంతంలో ఓ చోట డంపింగ్ చేసిన సుమారు రూ.25 లక్షల విలువ చేసే 240 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా వేలూరు జిల్లా అద్దెకుప్పానికి చెందిన వారిగా గుర్తించారు.
తలకోనలో కూంబింగ్
Published Sun, Aug 2 2015 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement