3నుంచి సీపీఐ సామూహిక దీక్షలు
Published Tue, Oct 1 2013 2:43 AM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
నయీంనగర్, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో సామూహిక సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ధి వెంకటేశ్వర్లు తెలిపారు. హన్మకొండ బాలసముద్రం లోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుయచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అం తేకాకుండా ఈనెల 10న అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. కాగా, తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రారంభించి 60 రోజులు దాటినా ఇప్పటి వరకు కేబినెట్ ముం దు నోట్ పెట్టకుండా జాప్యం చేడయం తగదన్నారు.
సున్నితమైన అంశంపై ఇరువర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలగించడంతో పాటు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలని వెంకటేశ్వర్లు కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ సమితి పిలుపు మేరకు సామూహిక సత్యాగ్రహ దీక్షలను ఈనెల 3న ములుగు, మహబూబాబాద్, 4న జనగామ, నర్సంపేట డివిజన్లలో, 5న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్నామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే పోతరాజు సారయ్యతో పాటు సీపీఐ నాయకులు మేకల రవి, మడత కాళిదాసు, టి.సత్యం, మోతె లింగారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement