ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పోలీసుల తనిఖీ
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇసుక రవాణా చేస్తున్న 31 లారీలను ఆంధ్ర సరిహద్దులో పోలీసులు సీజ్ చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద పట్టణ ఎస్సై కె.వాసునారాయణ సిబ్బందితో తనిఖీ చేసి లారీలను పట్టుకుని పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని లారీలను పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 31 లారీల్లో సుమారు 550 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఇచ్ఛాపురం చేరుకుని వాహనాలన్నింటినీ సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
తహశీల్దారు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఒడిశాలోని ఇసుకను ఆంధ్రకు తరలించడానికి ఎలాంటి అనుమతి లేదని ఆర్డీఓ చెప్పారు. లారీలు కావాలనుకుంటే ఇసుక ఇక్కడ వదిలేసి ఖాళీ వాహనాలతో ఆంధ్రలోకి వెళ్లండి లేదా ఇసుకతో సహా తిరిగి ఒడిశా వెళ్లిపోవాలని ఆర్డీఓ లారీ డ్రైవర్లుకు సూచించారు. తమ వాహనాలను విడిచిపెట్టాలని ఆర్డీఓని లారీల సిబ్బంది కోరగా ఆయన అంగీకరించలేదు. కాగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీల్లో అన్నీ ఆంధ్రావే కావడం గమనార్హం.
ఎచ్చెర్లలో పది..
ఎచ్చెర్ల: ఒడిశా నుంచి విశాఖపట్నం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి అధికారులు తనిఖీలు చేసి రెండు 8 లారీలు.. గురువారం సాయంత్రం ఎచ్చెర్ల తహశీల్దారు బందర వెంకటరావు ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు చేసి రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలను పోలీసులకు అప్పగించారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒడిశా నుంచి ఇసుక తరలింపునకు అనుమతి లేదు.
31 ఇసుక లారీల సీజ్
Published Fri, Nov 28 2014 1:07 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement