నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం సున్నపువారిపాలెం సమీపంలో 34 ఎర్రచందనం దుంగలను శనివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం సున్నపువారిపాలెం సమీపంలో 34 ఎర్రచందనం దుంగలను శనివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీటిని ఓ చోట డంప్ చేసి తరలించడానికి సిద్ధమవుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వారు కాగా, మిగిలిన నలుగురు చిత్తూరు జిల్లా వాసులు.