ఏపీలో ఇన్ఫెక్షన్‌ రేటు 1.14 శాతం | 38 Victims discharged after Recovery from Covid-19 | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇన్ఫెక్షన్‌ రేటు 1.14 శాతం

Published Mon, May 11 2020 5:11 AM | Last Updated on Mon, May 11 2020 5:11 AM

38 Victims discharged after Recovery from Covid-19 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్‌ రేటు ఆదివారం 1.14 శాతంగా నమోదైంది. ఆదివారం కోవిడ్‌ నుంచి కోలుకుని 38 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 925కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసులు 1010 ఉన్నాయి.  

► కోవిడ్‌ బారి నుంచి కోలుకుని కర్నూలు జిల్లా నుంచి 21 మంది, గుంటూరు జిల్లా నుంచి 8, కృష్ణా జిల్లా 3, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కరు చొప్పున డిశ్చార్జ్‌ అయ్యారు. 
► శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 8,666 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి కరోనా పాజిటివ్‌ నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.  
► కర్నూలు జిల్లాలో మరో మరణం సంభవించడంతో మొత్తం మరణాలు 45కి చేరాయి. ఇప్పటి దాకా మొత్తం 1,73,735 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,980కి చేరింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement