మృతుడు నిరీక్షణ్, ప్రాణాలు పోవడానికి కారణమైన చిప్స్ ప్యాకెట్ ఇదే.
ఏలూరు(వన్‌టౌన్): ‘రింగ్స్’ తినుబండారం ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. ప్యాక్‌లో రింగ్స్‌తో కలిపి ఉంచిన రబ్బరు బొమ్మ మింగి బాలుడు ఊపిరాడక మృతిచెందాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని 29వ డివిజన్ తాపీ మేస్త్రీ కాలనీ కుమ్మరిరేవులో నివాసముంటున్న మీసాల లక్ష్మణరావు టైల్స్ కార్మికుడు. బుధవారం ఉదయం అతని భార్య దుర్గ తన కుమారుడు నిరీక్షణ్‌కుమార్ (4)ను దుకాణానికి వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురమ్మని పంపారు.
నిరీక్షణ్‌కుమార్ పాల ప్యాకెట్‌తో పాటు తినడానికి రింగ్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చాక రింగ్స్ ప్యాకెట్ తింటూ అందులో ఉన్న రబ్బరు బొమ్మను కూడా మింగేయడంతో అది గొంతుకు అడ్డుపడింది. ఊపిరాడక విలవిల్లాడుతున్న బిడ్డను చూసిన తల్లి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంత వాసులను తీవ్ర విషాదానికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment