అడవిలో నుంచి అక్రమంగా గంజాయి మూటలు ఎత్తుకెళ్తున్న 18 మంది కూలీలను రాజవమ్మంగి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
రాజవమ్మంగి (తూర్పు గోదావరి) : అడవిలో నుంచి అక్రమంగా గంజాయి మూటలు ఎత్తుకెళ్తున్న 18 మంది కూలీలను రాజవమ్మంగి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజవమ్మంగి అటవీ ప్రాంతంలోకి పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసు సిబ్బందికి.. మూటలు ఎత్తుకెళ్తున్న కూలీలు తారసపడ్డారు.
వారిని ఆపి మూటల్లో ఏముందని ప్రశ్నించగా.. వారు పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మూటల్లో ఉన్న 425 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.