బతికుండగానే కాటికి.. | 65 years old man who rejects from family and goes to cemetery | Sakshi
Sakshi News home page

బతికుండగానే కాటికి..

Published Sat, Jun 13 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

65 years old man who rejects from family and goes to cemetery

పాలకొల్లు: ఆ పెద్దాయన నలుగురు సంతానానికి తండ్రి... అందర్నీ పెంచి ప్రయోజకులను చేసిన ఆయన ఇప్పుడు వారికి భారమయ్యాడు. మానవత్వం సిగ్గుపడేలా... ఆ వృద్ధుడ్ని శ్మశానంలో విడిచి వెళ్లిపోయారు కుటుంబీకులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు... పట్నాల బ్రహ్మం (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బ్రహ్మం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

 

దీంతో అతడ్ని కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పట్టణంలోని హిందూ శ్మశాన వాటికకు తీసుకొచ్చి కాటికాపరికి అప్పగించారు.  దీంతో ఫోన్ నెంబర్ ఇచ్చి... చనిపోతే కబురు పెట్టాలని చెప్పి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శనివారం హిందూ శ్మశాన వాటికకు వచ్చి బ్రహ్మంను పరామర్శించారు. అతడ్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. వృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement