విశాఖ మరో రికార్డుకు వేదికకానుంది.
విశాఖపట్నం: విశాఖ మరో రికార్డుకు వేదికకానుంది. ఏడువేల మందికి పైగా బాలికలు కూచిపూడి నాట్యం చేయనున్నారు. మూడు జిల్లాలకు చెందిన విద్యార్ధులు ఇందులో పాల్గొంటున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన ఏడువేలమంది బాలికలు కూచిపూడి నృత్యప్రదర్శన చేస్తున్నారు.
విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం ఈప్రదర్శన ప్రారంభమైంది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 21 గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు నృత్యప్రదర్శన ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబులు హాజరుకానున్నారు.