
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,285 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 845 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇందులో రాష్ట్రంలో 812 కేసులు కాగా, 29 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి వైరస్ బారిన పడ్డ వారు నలుగురు. వైరస్ బారినపడి ఐదుగురు బాధితులు మృత్యువాత పడ్డారు. 281 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8586 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 6,04,641కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,834కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,26,947 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. (భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment