శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి 854.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పాదన వల్ల నీటిమట్టం తగ్గింది. మరో 0.90 అడుగులకు నీటిమట్టం తగ్గితే మినిమం డ్రా డౌన్ లెవెల్ 854 అడుగులకు చేరుతుంది. అనంతరం కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తే రాయలసీమ రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. తెలంగాణ జెన్‌కో..5,853 క్యూసెక్కుల నీటితో 2.730 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.