నరసన్నపేట: టీడీపీ సర్కారు రైతులకు ఇచ్చిన పగలే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. టీడీపీ పాలనలో టీడీపీ విఫలమైందని ఆరోపించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణదాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన వాగ్దానాలాను అమలు చేయాలన్నారు.
రైతులకు గిట్టుబాటు, మద్దతు ధర రానప్పుడు రైతుల కోసం రూ. 5 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని సూచించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలపి కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి వచ్చారు. పార్టీ నాయకులు అధ్యక్షుడు సురంగి నర్శింగరావు, యాళ్ల కృష్ణంనాయుడు, చింతు రామారావు, ఆరంగి మురళి, కె.చంద్రభూషణగుప్తా, బగ్గు రమణయ్య, మోయ్యి లక్ష్మనాయుడు, కింతలి చలపతిరావు, రాజాపు అప్పన్న, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అన్నపూర్ణ రాష్ట్రానికి అప్రతిష్ట పాలు వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని
బూర్జ: అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రానికి టీడీపీ పాలన వచ్చి అప్రతిష్ట తెచ్చిందని వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్ కిరణ్‌కుమార్‌కి అందజేశారు. రాజధాని పేరు చెప్పి ప్రభుత్వం రైతులు భూములను కబ్జా చేసి వారిని కూలీలుగా మార్చే స్థితికి తెచ్చిందన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో ప్రకారం డ్వాక్రా, చేనేత కార్మికలు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయాలన్నారు. ఆందోళనలో జెడ్పీటీసీ సభ్యులు ఆనెపు రామకృష్ణ, ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, ఎంపీటీసీ సభ్యులు బూరి శ్రీరామ్మూర్తి, జడ్డు సురేష్, గండెం శ్రావణి, కొబగాన వేణుగోపాల్, సర్పంచులు వేపారి లక్ష్మీనారాయణ, జల్లు అప్పలస్వామినాయుడు, మామిడి రామచంద్రి నాయుడు, సత్యం, బాడె నర్సింహులు, నాయకులు గుమ్మిడి రాంబాబు, వియ్యపు కృష్ణ, కాగితాపల్లి జగన్, ఆనంద్, శ్రీను పాల్గొన్నారు.
రైతు సమస్యలపై పోరాటం
సీతంపేట: రైతు సమస్యలపై పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ నేత, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కూలీల వలసలు నిరోధించాలన్నారు. అనంతరం డిప్యూ టీ తహశీల్దార్ నానిబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సవర లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు పాలక రాజబాబు, మండల కోఆప్షన్ సభ్యుడు మూర మోహన్‌రావు, సర్పంచులు సవర గోపాలు, సాయికుమార్, చెంచయ్య, రాము, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బి.ఆదినారాయణ, ఎంపీటీసీ సభ్యులు బాపయ్య, మండల కన్వీనర్ జి.సుమిత్రారావు, పార్టీ నేతలు బి.పకీరు, మంగయ్య, సురేష్, భామిని కార్యదర్శి ధర్మారావు పాల్గొన్నారు.
9 గంటల విద్యుత్ ఇవ్వాలి
Published Tue, May 5 2015 4:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM
Advertisement
Advertisement