నరసన్నపేట, న్యూస్‌లైన్: స్త్రీనిధి బ్యాంకులో పొదుపు చేస్తే..9 శాతం వడ్డీ లభిస్తుందని కలెక్టర్ సౌరభ్‌గౌర చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బ్యాంకులు లేని ప్రాంతాల్లో ఐకేపీ ఏపీఎంల ద్వారా బ్యాంకులు ఉన్న చోట డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. జిల్లాలోని 30 వేల స్వయం శక్తి సంఘాలకు సుమారు రూ 350 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. స్వయంశక్తి సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు.
మరో రూ 100 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నరసన్నపేట మండల మహిళా సమాఖ్యకు రూ 2 కోట్లు రుణాలు మంజూరు చేస్తూ..మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి స్వయం శక్తి సంఘ సభ్యురాలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవడమే..కాకుండా..మిగతా వారి ఇళ్లల్లో సైతం నిర్మించేం దుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ఏవీ రామకృష్న, మేనేజర్ టి.కామేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శాస్త్రి, ఏపీడీ ధర్మారావు, తహశీల్దార్ ఎంవీ రమణ, ఎంపీడీవో ఎం.పోలినాయుడు, ఐకేపీ ఏసీ రవికుమార్, ఏపీఎం గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
స్త్రీ నిధి బ్యాంకులో 9 శాతం వడ్డీ
Published Thu, Dec 19 2013 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement