ఆరుగురిని కత్తులతో నరికిన ప్రత్యర్థులు..
ఆరుగురిని కత్తులతో నరికిన ప్రత్యర్థులు..
Published Mon, Aug 14 2017 9:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాత కక్ష్యల నేపథ్యంలో ఇరు కుటుంబాల సభ్యులు కత్తులతో దాడి చేసుకున్నారు. పొలానికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన ప్రత్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కత్తులతో నరికారు.
ఈ క్రమంలో మరో కుటుంబానికి చెందిన ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మొత్తం తొమ్మిది మందిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement