కక్షతో.. మట్టు పెట్టాడు | murder in kakinada 2 members dead | Sakshi
Sakshi News home page

కక్షతో.. మట్టు పెట్టాడు

Published Thu, Mar 2 2017 11:14 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

కక్షతో.. మట్టు పెట్టాడు - Sakshi

కక్షతో.. మట్టు పెట్టాడు

  • కాకినాడలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య 
  • తల, ముఖంపై ఇనుపరాడ్‌తో దాడి
  • పోలీసుల అదుపులో నిందితుడు
  • కక్ష.. కరాళ నృత్యం చేసింది. తరచూ అవమానిస్తూ..యజమానికి ఫిర్యాదు చేసి తిట్టించాడన్న ఆక్రోశం.. అతడిని చంపి తీరాలన్న రాక్షసత్వంతో దానవుడి వ్యవహరించాడు. స్నేహితుడితో కలిసి వస్తున్న ఆ వ్యక్తిని దారికాచి మారణహోమం సాగించాడు. ఆ ఇద్దరిని ఒకేసారి మట్టుపెట్టాడు.  ఇద్దరి తలలు, ముఖంపై ఇనుపరాడ్‌తో అతడు చేసిన దాడిని పరిశీలిస్తే.. అతడి పగ ఎంత తీవ్రంగా ఉందో విదితమవుతుంది. కచ్చితంగా చంపేయాలనే అతడు ఇంతటి ఘాతుకానికి పాల్పడాడ్డని అర్థమవుతోంది. 
     
    కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : 
    యాజమానికి తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో దారి కాచి ఇద్దరు వ్యక్తులపై ఇనుప రాడ్‌తో అత్యంత దారుణంగా దాడి చేసి హతమార్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి కాకినాడలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, రెండో వ్యక్తి జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. 
       టూ టౌ¯ŒS పోలీసుల కథనం ప్రకారం.. పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన బడుగు బాలగంగాధర తిలక్‌ (బాలా) (48) కాకినాడ రామారావుపేటలో సుబ్బయ్య హోటల్‌ సమీపాన అమృత కర్రీ పాయింట్‌ను నడుపుతున్నాడు. స్థానిక జగన్నాథపురానికి చెందిన అడ్లబోయిన అశోక్‌కుమార్‌ సుబ్బయ్య హోటల్‌ కేటరింగ్‌ వ్యా¯ŒSపై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి అశోక్‌కుమార్‌ వ్యక్తిగత పనిపై వెళుతూ వ్యా¯ŒSపై ఆప్టింగ్‌ డ్రైవర్‌గా «తన ఏరియాకు చెందిన ధర్మాని ప్రసాద్‌ను పెట్టాడు. ఇతడు వ్యా¯ŒSలో ఆహారాన్ని కాకినాడలో రెండు ట్రిప్పులు వేశాడు. గాంధీబొమ్మ సెంటర్‌ సమీపంలోని రైతుబజార్‌ రోడ్డులో వ్యా¯ŒSను నిలిపి సొంతానికి ఆహారం, కూరలు తీసుకుంటుండగా... బాలా చూశాడు. అతడిని మందలించి ఆ హోటల్‌కు తీసుకువెళ్లి అతడిపై యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ముందుగా చెప్పకుండానే మరో డ్రైవర్‌ను పనిలోకి పెట్టడంపై అశోక్‌కుమార్‌ను ఆ హోటల్‌ యాజమాన్యం మందలించిం ది. ఈ పరిస్థితికి బాలాయే కారణమని, గతంలో కూడా రెండు, మూడు సార్లు ఇలా అవమానించాడని అశోక్‌కుమార్‌ కక్ష పెంచుకున్నాడు. 
    అదును కోసం...
    బాలా, స్నేహితుడు జగడం రామస్వామి (44) ఇ ద్ద రూ కలసి హోటల్‌ ఎదురుగా ఉన్న మద్యం షాపు లో మద్యం సే విస్తుంటా రు. ఈ విషయా న్ని తెలుసుకున్న ఆశోక్‌కుమార్‌.. కేట రింగ్‌ వే¯ŒSలో ఇనుపరాడ్‌ పెట్టుకుని దారి కాచాడు. సరిగ్గా రాత్రి 12.30 గంటలకు వివాహానికి వెళ్లి రామేశ్వరం వెళ్లేందుకు అదే రూటులో వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వారిద్దరూ వస్తున్నారు. బుల్లెట్‌పై వస్తున్న బాలాను వెనుక నుంచి వేగంగా వ్యా¯ŒSతో  ఢీకొట్టాడు. కిందపడిన బాలా పైకి లేస్తుంటే ఇనుపరాడ్‌తో ముఖం, తలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. వెనకాల బై క్‌పై వస్తోన్న రామస్వామి స్నేహితుడిని కాపాడేందుకు యత్నిం చగా అతడిపై కూడా ఇనుపరాడ్‌తో ముఖం, తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాలా అక్కడికక్కడే మృతి చెందా డు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రామస్వామిని జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
     
    డీఎస్పీ పరిశీలన
    స్థానికుల సమాచారం మేరకు కాకినాడ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, సీఐ ఉమర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు. గురువారం వాటికి పోస్ట్‌మార్టమ్‌ చేయించారు. బాలా హత్యలో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో నలుగురైదుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు స్థానికులు అంటున్నారు. హత్య తర్వాత నలుగురు వ్యక్తులు శివాలయం వీధిలోకి బైక్‌లపై పరారైనట్టు అంటున్నారు. పోలీసులు మాత్రం ఈ హత్యలు ఒక్క వ్యక్తే చేసినట్టు  చెబుతున్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు ఆశోక్‌కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు.
     
    ఎస్సీ సంఘాల డిమాండ్‌
    దళిత వర్గానికి చెందిన ఈ ఇద్దరిని అతి దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ సంఘాల ప్రతి నిధులు డిమాండ్‌ చేశారు. జీజీహెచ్‌లో  పోస్ట్‌మార్టమ్‌ చేస్తున్న ప్రదేశానికి జిల్లా నలుమూలల నుంచి దళిత సంఘాల నాయకులు చేరుకుని ఆందోళన చే పట్టారు. సుబ్బయ్య హోటల్‌ యాజమాన్యానికి చెందిన కేటరింగ్‌ వ్యా¯ŒSతో ఢీకొట్టి హతమార్చడంపై సందేహం వ్యక్తం చేశారు. హోటల్‌ బయట, ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్‌ మెడికల్‌ షాపు వద్ద సీసీ కెమెరాలు ఉంటాయని, హత్య జరిగిన రోజున అవి ఎందుకు పనిచేయలేదనే కోణంలో దర్యాప్తు చేయాలని వారు కోరారు. 24 గంటలు ప నిచేసే మెడికల్‌ షాపు బుధవారం రాత్రి 10 గంటలకే షాపు మూసేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.  
     
    ‘సుబ్బయ్య హోటల్‌’పై కేసు పెట్టాలని డిమాండ్‌
    కాకినాడ క్రైం (కాకినాడ సిటీ):  సుబ్బయ్య హోటల్‌ యాజమాన్యంపై పోలీసు కేసు నమోదు చేయాలని హత్యకు గురైన మృతుల బంధువులు గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా హోటల్‌ కేటరింగ్‌ వ్యా¯ŒS డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ ఉద్దేశ పూర్వకంగా యాజమాన్యం సాయంతో బాలగంగాధర తిలక్‌ అలియాస్‌ బాలా, జగడం రామస్వామిలను హత్య చేశాడని వారు ఆరోపించారు. ఈ హత్యలకు కారణమైన వ్యక్తులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులపై హత్యాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మృతుల బం««దlువులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement