బాలికను చేరదీసిన రైల్వే పోలీసులు | A non-profit organization entrusted by the police | Sakshi
Sakshi News home page

బాలికను చేరదీసిన రైల్వే పోలీసులు

Published Mon, Oct 28 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

A non-profit organization entrusted by the police

మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ఓ బాలిక త ప్పిపోయి రైల్వే స్టేషన్‌లో దిగగా పోలీసులు చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. రైల్వే ఎస్‌ఐ హనుమప్ప కథనం ప్రకారం... ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు హైద్రాబాద్‌కు చెందిన పదేళ్ల జాన్సీ కాచిగూడ-గుంటూర్ ప్యాసింజర్ రైలులో ప్రయాణించి మహబూబ్‌నగర్ స్టేషన్‌లో దిగింది.
 
 అటు ఇటుగా తచ్చాడుతుండగా గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి బాలికను చేరదీసి వివరాలు సేకరించగా తనది హైదరాబాద్ అని కృషి కాన్సెప్ట్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నానని, తండ్రి గతంలోనే చనిపోయాడని తెలిపింది. తనకు తల్లి, అన్నయ్య ఉన్నారని, వారిద్దరూ వేరుగా ఉంటున్నారన్నారు. తను మాత్రం అమ్మమ్మ వద్ద ఉంటున్నట్లు చెప్పింది. అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement