ఆసిఫాబాద్/రూరల్, న్యూస్‌లైన్ : ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ తేజ్‌కరణ్(29) సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌కు గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. తేజ్‌కరణ్ మంగళవారం రాత్రి కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చాడు. తన సెల్‌ఫోన్‌ను చార్జింగ్ చేసేందుకు ప్లగ్‌లో పె ట్టాడు. అప్పటికే చార్జర్ పగిలి ఉండడంతో షాక్ గురై కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సబ్యులు ప్రభుత్వ ఆస్పత్రికితరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయూడు.
కొడుకు నామకరణం జరగకముందే..
తేజ్‌కరణ్ నాలుగేళ్ల క్రితం బతుకు దెరువుకోసం మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చాడు. భవన నిర్మాణ కార్మికుడిగా.. ఆపై తాపీమేస్త్రీ గా పనిచేస్తూ మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన తారాబాయిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. పక్షం రోజుల క్రితం వీరికి కుమారుడు జన్మించాడు. కుమారుడికి నామకరణం చేయకముందే సెల్ చార్జింగ్ రూ పంలో అతడు మృత్యువాత పడ్డాడు. కొడుకు పుట్టాడనే సంతోషంలో ఉన్న తారాబారుు భర్త మృతితో గుండెలవిసేలా రోదించింది. తేజ్‌కరణ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సెల్ చార్జింగ్ పెడుతుండగా..
Published Thu, Dec 12 2013 3:53 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement