ఏలూరు, న్యూస్‌లై న్ :
ప్రభుత్వం వంటగ్యాస్ ధరను అమాంతం పెంచేసి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేసింది. మరోవైపు ఆధార్ అనుసంధానం చేరుుం చుకోని వారికి గ్యాస్‌పై సబ్సిడీ మొత్తాన్ని ఇచ్చేది లేదని అధికారులు చావుకబురు చల్లగా చెబుతున్నారు. ఎలాంటి సాంకేతిక కారణాలున్నా తమకు సంబంధం లేదని, గడచిన డిసెంబర్ 31లోగా ఆధార్ అనుసంధానం చేరుుంచుకోని వినియోగదారులు సిలిండర్‌కు రూ.1,326 చొప్పున చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో అనుసంధాన ప్రక్రియ పూర్తి చేరుుంచుకోని సుమారు 2లక్షలకు పైగా వినియోగదారులకు గ్యాస్ గుదిబండగా మారనుంది.
నెలాఖరు వరకూ గడువు కోరినా...
ఆధార్ అనుసంధానం గడువును ఈ నెలాఖరు వరకు పెంచాలన్న డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. అధికారులతోపాటు ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది. అరుుతే, గడువు పొడిగించేందుకు అంగీకరిం చేది లేదని గ్యాస్ కంపెనీలు మొండికేస్తున్నారుు. ఈ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసేందుకు సిద్ధమైందని అధికార వర్గాల భోగట్టా. దీంతో డిసెంబర్ 31లోగా ఆధార్ అనుసంధానం చేరుుంచుకోని వారందరి నుంచి సిలిం డర్‌కు రూ.1,326 చొప్పున వసూలు చేసి తీరుతామని గ్యాస్ కంపెనీలు పేర్కొంటున్నారుు.
సుప్రీం కోర్టు వద్దన్నా...
గ్యాస్ సిలిండర్లకు ఆధార్ అనుసంధానం చేయూలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన సుప్రీం కోర్టు సబ్సిడీ వర్తింపునకు ఆధార్ కార్డు అర్హత కాదని వ్యాఖ్యానించింది. దీనికి తోడు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి సైతం గ్యాస్ పంపిణీకి ఆధార్ అవసరం లేదంటూ ప్రకటనలు గుప్పించారు. ఇది నిజమని నమ్మిని వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేయించుకోలేదు. జిల్లాలో మొత్తంగా 8.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నారుు. ఇందులో కేవలం 5.86 లక్షల మంది ఆధార్ అనుసంధానం చేరుుంచుకున్నారు. ఇంకా 2.64 లక్షల కనెక్షన్లకు అనుసంధానం కాలే దు. ఇందులో డబుల్ కనెక్షన్లు ఉన్నవారు, బినామీలు లక్షపైనే ఉన్నట్లు అంచనా. ఆరుుల్ కంపెనీల తాజా నిర్ణయంతో మిగతా వారంతా సబ్సిడీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
‘మా చేతుల్లో లేదు’ : ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువు పెంపు విషయమై డీఎస్‌వో డి.శివశంకరరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్నారు. గడువు పెంపు విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ తమకెలాంటి ఉత్తర్వులు అందలేదని తెలిపారు. అనుసంధానం చేరుుంచుకోని వారికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే అవకాశం లేదని చెప్పారు. తక్షణమే ఆధార్ అనుసంధానం చేరుుంచుకుంటే సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.
ఆధార్‌తో అవస్థ గడువు పెంపు లేనట్టే ?
Published Sat, Jan 4 2014 3:05 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement