పలమనేరు, న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న ఆమ్‌ఆద్మీ బీమా పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకం రానురానూ కనుమరుగవుతోంది. భవిష్యత్తులో కొత్త పాలసీలకు అవకాశం రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందులో సభ్యత్వం ఉన్న శ్రమశక్తి సంఘాల్లోని మహిళా కూలీల రెన్యూవల్స్ ఆపేశారు. కొత్త సభ్యత్వాన్ని స్వీకరించడం లేదు. ఈ క్రమంలో ఈ పథకం అటకెక్కుతుందేమోనన్న భావ న కలుగుతోంది.
పథకం లక్ష్యమిదీ
జిల్లాలోని మహిళా గ్రూపుల్లో 18 నుంచి 58 సంవత్సరాలలోపు వయసువారు ఈ పథకానికి అర్హులు. గ్రూ పులోని మహిళ భర్త సాధారణంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఆర్థికసాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2009లో ప్రవేశపెట్టారు. ఇందులో సభ్వత్వం కోసం పాలసీదారు రూ.15 చెల్లిస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యత్వ రుసుంగా రూ.160 చొప్పున రూ.320 చెల్లిస్తాయి. పాలసీదారులకు బాండ్లను అందజేస్తారు. సహజ మరణమైతే దహన సంస్కారాల కోసం తక్షణ సాయంగా రూ.5 వేలు, అనంతరం రూ.25 వేలు అందజేస్తారు. ప్రమాదవశాత్తు మరణిస్తే తొలుత రూ.5 వేలు, ఆపై రూ.70 వేలు నామినీ ఖాతాలోకి జమ చేస్తారు.
ఇప్పుడు జరుగుతున్నదేమంటే..
ఈ పథకం ద్వారా జిల్లాలో 1,93,024 మంది పాలసీదారులుగా సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరికి పూర్తిస్థాయిలో ఈ ఏడాదికి సంబంధించి రెన్యూవల్స్ జరగలేదు. సంబంధిత మండల సమాఖ్యల్లోని బీమా మిత్రలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలకే కొంతవరకు రెన్యూవల్స్ పూర్తి చేశారు. గ్రూపుల్లోని మహిళలు ఉపాధి పనులకు వెళ్లేవారి ప్రీమియంను ఆ ఖాతా నుంచి రెన్యూవల్స్ మొత్తాన్ని చెల్లించేవారు.
అయితే కొంతకాలంగా ఉపాధి హామీకి సంబంధించిన పనులు ఆగిపోయాయి. దీంతో ఆ శాఖ నుంచి డీఆర్‌డీఏ ఖాతాలోకి నగదు జమ కాకపోవడంతో శ్రమశక్తి సంఘాల్లోని మహిళలకు ఈ పథకాన్ని నిలుపుదల చేశారు. ఫలితంగా 77,619 మంది సభ్యులు రెన్యూవల్స్‌కు నోచుకోకుం డా పోయారు. దీనికితోడు పీవోపీ (పూరెస్ట్ ఆఫ్ ద పూర్)లో 3,098 మం దికి రెన్యూవల్స్ జరగలేదు. మొత్తం మీద 80,717 మందికి ఈ ఏడాది రెన్యూవల్స్ ఆగిపోయాయి.
పాత పాలసీలే కొనసాగింపు
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పాత పాలసీలను మాత్రమే కొనసాగిస్తున్నారు. కొత్త పాలసీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.
పాత పాలసీలకూ ఇబ్బందే
ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించిన వెంటనే జిల్లాలోని కాల్ సెంటర్‌కు సమాచారం అందుతుంది. 24 గంటల్లోపు దహన సంస్కారాల కోసం జిల్లా సమాఖ్య మృతుని కు టుంబానికి రూ.5 వేలు అందివ్వాలి. ఆపై పూర్తి క్లైమ్ నామీని ఖాతాలోకి జమ కావాలి. అయితే ఇందుకు డెత్ సర్టిఫికెట్, పోలీసుల నుంచి ఎఫ్‌ఐ ఆర్, డాక్టర్ సర్టిఫికెట్లు అవసరం. సమైక్య సమ్మె నేపథ్యంలో దర ఖాస్తులు పెండింగ్‌లో పడడంతో బా ధితులు ధ్రువీకరణ పత్రాలు అందక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో 848 మంది లబ్ధిదారులకు క్లైమ్‌లు అం దాల్సి ఉంది. ఈ విషయమై ఆమ్‌ఆద్మీ బీమాయోజన డీపీఎం లక్ష్మీప్రసాద్ రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, కొత్తపాలసీలు తీసుకోరాదని తమకు ఆదేశాలున్నాయన్నారు. ఉపాధి హామీ కి సంబంధించి సాంకేతిక కారణాలతో కొన్నింటిని రెన్యూవల్ చేయలేదన్నారు. పాత పాలసీలదారుల రెన్యూవల్స్, బెనిఫిట్స్ సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు.
‘ఆమ్ ఆద్మీ’పై నీలినీడలు!
Published Sun, Oct 20 2013 3:32 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement