
సాక్షి, విజయవాడ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టైటిల్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలియజేశారు. అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసిన సింధు భారతీయుల క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. నేటి యువత ఈ విజయాన్ని స్పూర్తిగా తీసుకోవాలని అభిలషించారు. ప్రపంచ శ్రేణి క్రీడాకారిణిని దేశానికి అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.