కాకినాడ : మరో చిరు ఉద్యోగి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్లో బుధవారం చోటు చేసుకుంది. ఖాళీ స్థలానికి పన్ను విధించే అంశంపై కార్పొరేషన్ బిల్లు కలెక్టర్ను ఆశ్రయించాడు స్థలం యజమాని. ఆ క్రమంలో రూ. 83 వేలు లంచం ఇస్తే... అలాగే చేస్తాను అని డిమాండ్ చేశారు.
దీంతో తాను అంత ఇచ్చుకోలేనని స్థల యజమాని చెప్పడంతో రూ. 30 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. స్థల యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ రంగంలోకి దిగింది. కాకినాడ రైల్వే గేట్ సమీపంలో లంచం తీసుకురావాలని స్థల యజమానికి బిల్లు కలెక్టర్ సూచించాడు. ఆ క్రమంలో లంచం తీసుకుంటూ బిల్లు కలెక్టర్ రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కాడు.