kakinada municipal corporation
-
కాకినాడలో విజయం ‘కేక’.. భంగపడ్డ టీడీపీ
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన 17వ వార్డు కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టార్) అత్యధిక మెజారీ్టతో విజయకేతనం ఎగురవేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యులు మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు 35 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా వైఎస్సార్ సీపీ బలపరిచిన చోడిపల్లి సత్యప్రసాద్‌కు 25 మంది కార్పొరేటర్లు అనుకూలంగా ఓటు వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వాసిరెడ్డి రామచంద్రరావు ప్రతిపాదించగా ఎంజీకే కిషోర్ బలపరిచారు. టీడీపీ తరఫున పలివెల రవి అనంతకుమార్‌ను ఆ పార్టీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ ప్రతిపాదించగా మేయర్ సుంకరపావని బలపరిచారు. పలివెల రవికి మద్దతుగా 10 మంది చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో 25 ఓట్లు దక్కించుకున్న చోడిపల్లి ప్రసాద్ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు జేసీ లక్ష్మీశ ప్రకటించారు. ఫారమ్ ఏ, బీలలోనూ టీడీపీ వైఫల్యం టీడీపీలో అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది. 24 గంటల ముందు విప్‌జారీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో లేఖను ఎన్నికల అధికారికి అందజేశారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ నిబంధనల ప్రకారం 24 గంటల ముందుగా లేఖ ఇవ్వనందున విప్ చెల్లదని స్పష్టం చేశారు. పార్టీ అభ్యరి్థకి సంబంధించిన ఇతర వివరాలతో కూడిన లేఖ ఒరిజనల్ ఇవ్వకుండా నకలు ఇచ్చినందున తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉదయాన్నే పోటీలో నిలవడం, పత్రాలన్నీ గందరగోళంగా ఉండడం, పార్టీ తీరుతో వ్యతిరేకించి మరో అభ్యరి్థకి మద్దతుగా నిలవడం వంటి సంఘటనలు టీడీపీ అనైక్యతను బయటపెట్టాయి. మేయర్ అవగాహనా రాహిత్యం డిప్యూటీమేయర్ ఎన్నికలో మేయర్ సుంకరపావని ఆవగాహన రాహిత్యం బయటపడింది. నాలుగేళ్లపాటు మేయర్‌గా ఉన్నా కౌన్సిల్ నిబంధనలు, ఎన్నికల ప్రక్రియపై ఆమెకు అవగాహన కొరవడిన తీరుచూసి కార్పొరేటర్లు ముక్కున వేలేసుకున్నారు. ఎన్నిక సందర్భంలో మేయర్‌గా తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని ఎన్నిక అధికారిని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి అధ్యక్షత వహిస్తారని, మిగిలినవారంతా కింద వరుస క్రమంలో కూర్చోవాలని ఆయన నిబంధనలను వివరించాల్సి వచ్చింది. అలాగైతే తాను నిలబడే ఉంటానంటూ చేసిన వ్యాఖ్యానం కార్పొరేటర్లను, అధికారులను విస్మయపరిచింది. సమర్థతకు దక్కిన ‘డిప్యూటీ’ పీఠం కాకినాడ: ప్రజా సమస్యలపై, కార్పొరేషన్ చట్టాలపైన సంపూర్ణ అవగాహన కలిగిన సమర్థుడైన వ్యక్తికి ఉప మేయర్ పదవి దక్కడం జిల్లా ప్రగతికి శుభపరిణామమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా ఐక్యతతో ఉండి అభివృద్ధి కోసం ఒక అవగాహన కలిగిన ప్రసాద్మాస్టార్ వంటి వ్యక్తిని ఎన్నుకున్న తీరు భవిష్యత్‌కు శుభసూచికమని పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బీసీ వాడబలిజ వర్గానికి చెందిన వ్యక్తికి రాజకీయంగా మంచి ప్రాధాన్యత లభించిందని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. 35 మంది కార్పొరేటర్లతో గతంలో అధికారంలో ఉన్న పార్టీ చోడిపల్లిని గుర్తించకపోయినా సీఎం గుర్తించి డిప్యూటీమేయర్గా చేశారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మేయర్ సుంకర పావని తీరును వ్యతిరేకిస్తూ అంతా ఒక్కటై ఐక్యత కనబరిచారని ద్వారంపూడి పేర్కొన్నారు. ఉప మేయర్‌గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ మాట్లాడారు. ఉప మేయర్ జీవిత వివరాలు పేరు : చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టారు) వయసు : 56 చదువు : బీఏ, బీఈడీ నేపథ్యం : 1995 నుంచి రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా నాలుగుసార్లు వరుస విజయాలు. తండ్రి చోడిపల్లి రామం 1982లో కౌన్సిలర్‌గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి. చిన్నాన్న హనుమంతరావు స్వాతంత్య్ర సమరయోధులు. నాలుగుసార్లు గెలిచినా వనమాడి అవకాశం దక్కనీయలేదు. వాడబలిజలకు దక్కిన అవకాశం డిప్యూటీ మేయర్ ఎన్నికలో వాడబలిజలకు సముచిత గౌరవం దక్కింది. కాకినాడ చరిత్రలో ఇదొక మంచి పరిణామమంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. దాదాపు 40వేల మంది మత్స్యకారులు ఉన్న కాకినాడలో 50శాతం వాడబలిజలు ఉన్నారు. ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఈ వర్గానికి గుర్తింపు దక్కిన దాఖలా లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దినెలల క్రితమే అగి్నకుల క్షత్రియ వర్గానికి చెందిన బంధన హరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు వాడబలిజలకు డిప్యూటీమేయర్ దక్కింది. మత్స్యకార వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన హయాంలో ఈ వర్గాలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయతి్నంచారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో వాడబలిజకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిప్యూటీమేయర్ కట్టబెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి వైఎస్సార్ సీపీ ఎలాంటి ప్రాధాన్యతనిస్తోందో చెప్పకనే చెప్పింది. బెడిసికొట్టిన చివరి క్షణ నిర్ణయం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని తొలుత ప్రకటించిన టీడీపీ చివరి నిముషంలో తన వైఖరిని మార్చుకుని పోటీలో నిలబడింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు పార్టీ అధినేత నుంచి గట్టిగా మందలింపురావడతో పోటీ చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. వనమాడి వ్యవహారశైలి, నియంతృత్వ పోకడలపై అసంతృప్తిగా ఉన్న అనేక మంది టీడీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు చేయడంతోపాటు మరికొంత మంది సమావేశానికి హాజరుకాలేదు. -
ఓటమి భయంతో కాకినాడలో తోక ముడిచిన టీడీపీ
కాకినాడ: నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ ముందే తోక ముడిచింది. ఈ ఎన్నికలో తమ పార్టీ పాల్గొనడం లేదంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం ప్రకటించారు. రెండో డిప్యుటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ కార్పొరేషన్లో రాజకీయం రసకందాయంలో పడింది. నాటి ఎన్నికల్లో టీడీపీకి 32 మంది కార్పొరేటర్లతో మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలు, పార్టీ పట్ల అంకిత భావంతో పని చేసే వారిపై వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరితో చాలాకాలంగా టీడీపీ కార్పొరేటర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఆయన విధానాలు నచ్చక టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. తాజాగా మెజార్టీ కార్పొరేటర్లు కూడా బయటకొచ్చేశారు. ప్రస్తుతం మేయర్‌తో కలిపి పది మందికి మించి కార్పొరేటర్లు కూడా ఆ పారీ్టలో లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా ఏకతాటిపై పని చేస్తామంటూ వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. వారు తమ నిర్ణయాన్ని మీడియా ముందు ప్రకటించడంతో టీడీపీ కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. దీంతో ఎన్నికలకు ముఖం చాటేయాలనే నిర్ణయానికి వచ్చింది. సంక్షేమానికి జై .. కాకినాడలోని 45 మంది కార్పొరేటర్లలో 35 మంది ఒక్కటిగా కలిసి ఉంటామంటూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మంగళవారం మీడియా ముందు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 48 డివిజన్లకు ఎన్నికలు జరగగా టీడీపీ 32, వైఎస్సార్ సీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు. ముగ్గురు మృతి చెందగా ప్రస్తుతం 45 మంది ఉన్నారు. వీరిలో 35 మంది పార్టీ రహితంగా జగన్‌కు జై కొట్టారు. మేయర్ సుంకర పావని సహా 10 మంది మాత్రమే టీడీపీ పక్షాన నిలిచారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియంతృత్వ పోకడలతో విసుగెత్తిపోయమని.. సీఎం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తామంతా మద్దతుగా నిలిచామని ప్రకటించారు. వైఎస్సార్ సీపీకి జై కొట్టిన వీరందరూ బుధవారం రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఏకతాటిపై ఉండాలని నిర్ణయించుకున్నారు. తామంతా ముఖ్యమంత్రి నాయకత్వంలో ద్వారంపూడికి మద్దతుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక బుధవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరించనున్నారు. -
ఏపీ: ఏసీబీ మెరుపు దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై మెరుపు దాడులు నిర్వహించింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో ఏక కాలంలో 25 ఏసీబీ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. పక్కా వ్యూహంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు నగదు, నగలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్‌రావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గంధం వెంకట పల్లంరాజు, తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) లంకె రఘుబాబు, విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామ పీఏసీఎస్ స్టాఫ్ అసిస్టెంట్ సీరంరెడ్డి గోవిందు, కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ (పీఏ టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్) సాకే సత్యం ఇళ్లతోపాటు వారి బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ఐదుగురుకి చెందిన ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.11 కోట్లు పైబడి ఉంటాయని, బయట మార్కెట్లో ఇంకా ఎక్కువగా ఉంటాయని ఏసీబీ డీజీ తెలిపారు. వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. భారీగా ఆస్తులు, బంగారం, నగదు గుర్తింపు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) సీఈవో లంకె రఘుబాబు ఇంటిపైన, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంధం వెంకట పల్లంరాజు ఉంటున్న లాడ్జిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాకినాడలో పల్లంరాజుకు సంబంధించిన ఆదాయ వివరాలు ఏమీ లభించకపోవడంతో ఆయనను విశాఖపట్నం తీసుకెళ్లారు. కాగా లంకె రఘుబాబు నివాసంలోని సోదాల్లో దాదాపు రూ.15 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. రఘుబాబు ఇంటితోపాటు విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంలోని ప్రాంతాల్లో ఉంటున్న ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ పీఏ ఆస్తుల విలువ రూ.5 కోట్లు విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయనకు ఆదాయానికి మించి 1.75 కోట్ల అక్రమాస్తులున్నట్టు గుర్తించారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ సాకే సత్యం ఇంటితోపాటు ఆయన తమ్ముడు నారాయణస్వామి ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురంలో నిర్వహించిన సోదాల్లో పలు ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలతోపాటు బంగారు నగలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.5 కోట్లకుపైగానే ఉంటుందని నిర్ధారించారు. గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ) పార్వతీపురంలో ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తూతిక మోహనరావుకు సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురంలో ఉన్న ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి మార్కెట్ విలువ ప్రకారం మొత్తం రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు నిర్ధారించారు. -
వైఎస్ జగన్ కాకినాడ పర్యటన ఖరారు
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నఅనంతరం ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ కాకినాడ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన 26న (శనివారం) కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అస్వస్థత కారణంగా వైఎస్ జగన్ పర్యటనను ఆదివారానికి పోస్ట్ పోన్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రెండు చోట్ల బహిరంగసభలు, రోడ్డు షో నిర్వహించనున్నారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వెల్లడించారు. శనివారం సాయంత్రం కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి కారులో కాకినాడ వస్తారని, ఉదయం 10.30 గంటలకు అన్నమ్మ ఘాటి వద్ద జరిగే బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డులో రోడ్డు షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డెయిరీ ఫారం సెంటర్ చేరుకున్న తర్వాత అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమవుతారని తెలిపారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కాకినాడ పౌరులు జగన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. -
ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్
కాకినాడ : మరో చిరు ఉద్యోగి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్లో బుధవారం చోటు చేసుకుంది. ఖాళీ స్థలానికి పన్ను విధించే అంశంపై కార్పొరేషన్ బిల్లు కలెక్టర్‌ను ఆశ్రయించాడు స్థలం యజమాని. ఆ క్రమంలో రూ. 83 వేలు లంచం ఇస్తే... అలాగే చేస్తాను అని డిమాండ్ చేశారు. దీంతో తాను అంత ఇచ్చుకోలేనని స్థల యజమాని చెప్పడంతో రూ. 30 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. స్థల యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ రంగంలోకి దిగింది. కాకినాడ రైల్వే గేట్ సమీపంలో లంచం తీసుకురావాలని స్థల యజమానికి బిల్లు కలెక్టర్ సూచించాడు. ఆ క్రమంలో లంచం తీసుకుంటూ బిల్లు కలెక్టర్ రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు.