Bill collector
-
బిల్ కలెక్టర్ రాసలీలలు
కేజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని రామసాగర గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ కామాంధునిగా అవతారమెత్తాడు. పనుల కోసం వచ్చే మహిళలను బెదిరించి లోబర్చుకుని కామలీలలకు పాల్పడుతున్నాడు. తోటి మహిళా ఉద్యోగుల మీద కూడా కన్నేశాడు. ఓ కాంట్రాక్టు ఉద్యోగినితో అతగాడు రాసలీలలు చేసిన వీడియోలు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాలు.. బిల్ కలెక్టర్ అర్జున్ హరికృష్ణ (36) లీలలు ఇవి. బాధితురాలు మాట్లాడుతూ పంచాయతీలో ఉద్యోగం పర్మినెంట్ చేయడంతో పాటు, భర్తకు కూడా ఉద్యోగం కల్పిస్తానని తనకు ప్రలోభాలు పెట్టేవాడని తెలిపింది. ఒప్పుకోకుంటే తీవ్రచర్యలుంటాయని భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. పంచాయతీ కార్యాలయంలోనే ఈ అకృత్యం చోటుచేసుకుంది. హరికృష్ణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సభ్యులు పిడిఓకు విన్నవించారు. బాధితురాలిని ఒప్పించి ఆమె చేత బేత మంగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో బిల్ కలెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ఏసీబీ వలలో జీఎంసీ బిల్ కలెక్టర్
సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : ఇంటి పన్ను మార్చేందుకు బిల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ టి.కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరువారితోట 6వ లైనులో నివాసం ఉండే కె.పాండవులు లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలో ఉన్న నివాసాన్ని తన ఇద్దరు కుమారులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు రెండు భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఇంటి పన్ను మార్చేందుకు వారం రోజుల కిందట కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఇంటి పన్ను అంచనా వేసి మార్చేందుకు గాను బిల్ కలెక్టర్ భూపతి వీర్రాజు రూ.10వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే తప్ప తాను ఇంటి పన్ను మార్చే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. నాలుగు సార్లు అతని చుట్టూ తిరిగినప్పటికీ ఎటువంటి ప్రతిఫలం లేదు. అనంతరం రూ.7వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఈ నెల 16వ తేదీన పాండవులు ఏసీబీ అధికారులను కలిశాడు. రెండు రోజులపాటు తాను ఊర్లో ఉండనని చెప్పడంతో ఏసీబీ అధికారులు సోమవారం సదరు బిల్ కలెక్టర్‌కు వలపన్నారు. ఈక్రమంలో ఉదయం సమయంలో పాండవులు బిల్ కలెక్టర్ భూపతి వీర్రాజుకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను రమ్మని పిలిచాడు. అప్పటికే నగదును సిద్ధం చేసిన ఏసీబీ అధికారులు పాండవులు ద్వారా బిల్ కలెక్టర్ వీర్రాజుకు నగదు అందజేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న వీర్రాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు అతడిని వెంటనే ఏసీబీ కార్యాలయానికి తరలించారు. -
ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి బిల్ కలెక్టర్
సాక్షి, కూకట్పల్లి: ఆస్తి పన్ను తగ్గించేందుకు ఓ షాపు యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసిన ఓ బిల్ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్పల్లి సర్కిల్–24లోని ఆస్బెస్టాస్ కాలనీ ఏరియాకు బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మహేంద్రనాయక్ కాలనీలోని రాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు సంబంధించి ఆస్తి పన్నును తగ్గించేందుకు రూ.36 వేలు డిమాండ్ చేయగా షాపు యజమాని ఎం.నాగరాజు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అధికారులు కెమికల్ కలిపిన నోట్లను నాగరాజుకు ఇచ్చి పంపారు. డబ్బులు తీసుకునేందుకు షాపు వద్దకు వచ్చిన మహేంద్రనాయక్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు మహేంద్రనాయక్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రామాంతపూర్‌లో బిల్ కలెక్టర్ బల్లకింద బాగోతం
-
వీరింతే!
కర్నూలు(టౌన్) : ఈ ఏడాది జనవరి 27న కర్నూలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాలసుబ్రమణ్యం రూ.15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్‌కు బిల్లులు క్లియరెన్స్ చేసేందుకు ఈ లంచం డిమాండ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇది మరువక ముందే తాజాగా మంగళవారం నగర పాలక రెవెన్యూ విభాగంలో పనిచేసే బిల్ కలెక్టర్ సుధాకర్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ ఘటనలు నగర పాలక సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ప్రక్షాళన ఏదీ? పన్ను వసూళ్లలో నగర పాలక రెవెన్యూ విభాగం కీలకమైనది. ఈ విభాగంలో ఇద్దరు రెవెన్యూ అ«ధికారులు, ఏడుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 23 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. వీరంతా 94 వేల అసెస్మెంట్లకు సంబంధించిన ఆస్తి పన్ను, 48 వేల కొళాయి కనెక్షన్ల నీటి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. రెండు అర్ధ సంవత్సరాల్లో ఆస్తి పన్ను రూ.36 కోట్లు, నీటిపన్ను రూ.8 కోట్లు వసూలు చేయాలి. అలాగే నూతనంగా చేపట్టే ఇళ్లు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్టుమెంట్లు .. ఇలా ప్రతి నిర్మాణానికి పన్ను వేయాల్సి ఉంటుంది. ఇక్కడే పెద్దఎత్తున అవినీతి జరుగుతోందన్న విమర్శలున్నాయి. రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. కర్నూలు నగరంలోని కల్లూరు అయ్యప్పస్వామి నగర్లో నాగ లక్ష్మీదేవి కుటుంబం ( రెవెన్యూ వార్డు 77) నివసిస్తోంది. వారికి అక్కడే సాయి విద్యానికేతన్ స్కూలు ఉంది. ఈ స్కూలుకు కొళాయి కనెక్షన్ కావాలని అదే ఏరియాకు చెందిన బిల్ కలెక్టర్ సుధాకర్‌ను ఆశ్రయించారు. కొళాయి కనెక్షన్ కావాలంటే ముందుగా పన్ను వేయాలంటూ నెలరోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు బిల్ కలెక్టర్ రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. అప్పటికే విసిగి వేజారిన నాగలక్ష్మీదేవి తమకు తెలిసిన వ్యక్తి రవికుమార్ ద్వారా మాట్లాడించి.. రూ.5 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇదే విషయంపై రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌ను వల పన్ని పట్టుకునేందుకు వారు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక శ్రీరామ థియేటర్ వద్ద బిల్ కలెక్టర్ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా.. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి నగరపాలక రెవెన్యూ విభాగానికి తరలించి విచారించారు. ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని.. రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. నగరపాలక సంస్థలో మరికొంత మంది ఉద్యోగులపై ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపైనా దృష్టి పెట్టామని డీఎస్పీ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్
పిఠాపురం టౌన్: కొత్తగా నిర్మించిన పై అంతస్తుకు తక్కువ పన్ను వేసినందుకు బదులుగా రూ.ఆరు వేలు లంచం తీసుకుంటూ బిల్లు కలెక్టర్ నాగరాజు మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన గొల్లపల్లి కన్నయ్య 2016లో పిఠాపురంలోని వైఎస్సార్ గార్డెన్లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేశాడు. అప్పట్లో అర్ధసంవత్సరానికి రూ.1600 పన్ను చెల్లించేవాడు. అనంతరం అదే ఇంటిపై అంతస్తు నిర్మించాడు. దీనికి కూడా పన్ను విధించాలని సంబంధిత మున్సిపల్ రెవెన్యూ అధికారులను కోరారు. ఆ మేరకు ఇంటి కొలతలు తీసుకున్న అనంతరం బిల్లు కలెక్టర్ నాగరాజు కన్నయ్యతో మాట్లాడుతూ కొలతల ప్రకారం రూ.3400 పన్ను వేయాల్సి వస్తుందని రూ.ఎనిమిది వేలు లంచం ఇస్తే పన్ను తగ్గిస్తానని చెప్పాడు. దాంతో రూ.ఆరు వేలు ఇస్తానని పన్ను తగ్గించి వేయాలని కన్నయ్య బిల్లు కలెక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు పన్ను తగ్గించి రూ.2020లు వేయగా దాని ప్రకారం కన్నయ్య చెల్లించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా లంచం సొమ్ములు ఇవ్వలేదని బిల్లు కలెక్టర్ నాగరాజు కన్నయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయానని ప్రాధేయపడ్డాడు. అయినా వినకుండా నాగరాజు కన్నయ్యకు ఫోన్‌చేసి బెదిరించేవాడు. తన పై అధికారులు డబ్బులు అడుగుతున్నారని లేదంటే పన్ను పెంచేస్తానని హెచ్చరించడంతో కన్నయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం పథకం ప్రకారం మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి కన్నయ్య నుంచి రూ.6వేలు లంచాన్ని బిల్లు కలెక్టర్ నాగరాజు తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు. రసాయన పరీక్షల ద్వారా బిల్లు కలెక్టర్ లంచం తీసుకున్నట్టు నిర్ధారించిన ఏసీబీ అధికారులు బిల్లుకలెక్టర్ను అదుపులోకి తీసుకుని మున్సిపల్ కమిషనర్ .రామ్మోహన్ నుంచి వివరాలు సేకరించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఏసీబీ డీఎస్పీ సుధాకర్ తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన బిల్‌కలెక్టర్
నర్సంపేట: ఇంటి యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి నగర పంచాయతీ బిల్‌కలెక్టర్‌ను పట్టుకున్న సంఘటన పట్టణంలో మంగళవారం జరిగింది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన జడల వెంకటేశ్వర్లు తన స్వయాన సోదరుడు జడల శ్రీనివాస్ ఇంటికి సంబంధించిన యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని 2017, డిసెంబర్ 22న దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని బిల్‌కలెక్టర్ మురళీ తెలపడంతో వారం రోజుల క్రితం ఆ డబ్బులను వెంకటేశ్వర్లు ముట్టజెప్పాడు. అయినప్పటికీ ఆలస్యం చేస్తుండటంతో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా మరో రూ.10 వేలు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని తెగేసి చెప్పాడు. వెంకటేశ్వర్లు ఎంత బతిమిలాడినా మురళీ అంగీకరించలేదు. దీంతో మూడు రోజుల క్రితం వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు అతడు రూ.10 వేలను బిల్‌కలెక్టర్‌కు ఇస్తుండగా ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ డీఎస్పీ ముద్దసాని కిరణ్‌కుమార్, సీఐలు సతీష్, పులి వెంకట్, క్రాంతికుమార్ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనంతరం మురళీని నగర పంచాయతీకి తరలించి రికార్డులను తనిఖీ చేసి విచారించారు. అక్కడి నుంచి మురళీ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేసి ఆస్తుల వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలను స్వాదీనం చేసుకొని అరెస్ట్ చేశారు. బుధవారం పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీడీ వెల్లడించారు. బాధ భరించలేక ఏసీబీని ఆశ్రయించా న్యాయంగా మాకు ఇవ్వాల్సిన ఓనర్షిప్ సర్టిఫికెట్ ఉచితంగా ఇవ్వకుండా కొన్నిరోజులు తిప్పుకున్న తర్వాత డబ్బులు ముట్టజెబితేనే ఇస్తానని మురళీ అనడంతో గత్యంతరం లేక గతంలో రూ.20 వేలు ఇచ్చాను. అయినప్పటికీ మరో రూ.12 వేలు కావాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించా. రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించా. -
ఏసీబీకి చిక్కిన లంచగొండి బిల్ కలెక్టర్
-
ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
కామారెడ్డి క్రైం : ఇంటి యజమాని పేరు మార్పిడి పత్రం ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు కామారెడ్డి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇన్చార్జి బిల్ కలెక్టర్ దేవరాజు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని కృష్ణమ్మ కాలనీకి చెందిన చిక్కలపల్లి శ్రీనివాస్ ఇటీవల తన ఇంటిపక్కనున్న ఇంటిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఇంటి యజమాని పేరు మార్చుకోవడానికి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. 15 రోజులుగా కార్యాలయం చుట్టు తిరుగుతున్నాడు. రూ. 6,500 ఇస్తేనే పనిచేస్తానని ఇన్చార్జి బిల్ కలెక్టర్ దేవరాజు తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక రూ. 4,500 ఇస్తానని, ఇంటి యజమాని పేరు మార్పిడి పత్రం ఇవ్వాలని కోరాడు. దీనికి ఇన్చార్జి బిల్ కలెక్టర్ అంగీకరించాడు. ఈ విషయాన్ని శ్రీనివాస్ ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మంగళవారం రూ. 4,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ దొరికిన దేవరాజుపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అయినా మారడం లేదు.. కామారెడ్డి మున్సిపాలిటీపై గతంలోనూ పలుమార్లు ఏసీబీ దాడి చేసింది. 2005లో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ ఆటో డ్రైవర్ సమీర్ వద్దనుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే మల్లికార్జున్ ఎంబీ రికార్డులు చేయడం విషయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మూడు నెలల క్రితం ఇంజినీర్‌స్థాయి అధికారిపై ఫిర్యాదులు రాగా.. ఏసీబీ దాడులు చేసింది. అయితే సమాచారం ముందుగానే లీక్ కావడంతో సదరు అధికారి తప్పించుకున్నాడు. ఏసీబీ దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. అధికారుల తీరు మారడం లేదనడానికి తాజాగా లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఇన్చార్జి బిల్ కలెక్టర్ ఉదంతమే సాక్ష్యం.. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్ సిటీ): ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడని ఏసీబీకి ఫిర్యాదు అందింది.దీంతో సదరు బిల్‌కలెక్టర్‌కు చెందిన నివాసాలపై శుక్రవారం ఏక ధాటిగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఐదు బృందాలు, సిద్దిపేట జిల్లా నంగునూరులో మూడు బృందాలు ఒకే సారి దాడులు నిర్వహించి సుమారు 2.98లక్షల విలువచేసే ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు ఆరుకోట్ల రూపాయల విలువచేసే ఆస్తులున్నట్లు కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. జీహెచ్ఎంసీ ఆబిడ్స్ సర్కిల్9లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మడప నర్సింహా రెడ్డి కూకట్‌పల్లిలోని హెచ్ఎంటీ శాతవాహననగర్‌లో నివాసం ఉంటున్నాడు. 1987లో బిల్‌కలెక్టర్‌గా విధుల్లో చేరిన నర్సింహారెడ్డి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించాడని, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు నిఘావేసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. హెచ్ఎంటీ శాతవాహననగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం ఆరుగంటలకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలలో 61వేల నగదుతో పాటు శాతవాహన నగర్‌లోని జీ ప్లస్ త్రీ, కళ్యాణ్‌నగర్‌లో జీ ప్లస్ వన్, బాలానగర్‌లో జీ ప్లస్ టూ, కూకట్‌పల్లిలో జీ ప్లస్ టూ అంతస్థుల భవనాలు, ఏడు ఖాళీస్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నిజాంపేటలో మూడు, కేపీహెచ్బికాలనీలో ఒకటి, కళ్యాణ్‌నగర్‌లో మరోకటి, నంగునూరులో రెండు ఉన్నాయి. వీటితో పాటు నంగునూరులో 33.01 ఎకరాల వ్యవసాయ భూమి, చేర్యాలలో ఒక ఎకరం భూమి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా రెండు కిలోల బంగారు ఆభరణాలు, 3.745కేజీల వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఒక మారుతి స్విప్ట్ కారు, రెండు ట్రాక్టర్లు, ఒక గ్లామర్ హోండా మోటర్సైకిల్లతో పాటు బ్యాంక్‌లో 16లక్షల నగదు, 10 ఇన్సూరెన్స్ పాలసీలలో పదిలక్షల విలువచేసే బాండ్లు కూడా ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో పాల్గొన్న వారిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు విజయబాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, మంజుల, లక్ష్మి, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. కక్షతోనే ఫిర్యాదు... సిద్ధిపేటలోని వ్యవసాయ భూమి విషయంలో నెలకొన్న వివాదంతో తనపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బంధువులు ఏసీబీకి తప్పుడు ఫిర్యాదులు చేశారని బిల్‌కలెక్టర్ మడప నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. -
బిల్ కలెక్టర్ సస్పెన్షన్
గుంటూరు (నెహ్రూనగర్): పల్స్ సర్వే వి«ధులు సక్రమంగా నిర్వహించనందుకుగాను నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.మాధవ్‌ను సస్పెండ్ చేస్తూ సోమవారం నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నాటికి పల్స్ సర్వే గడువు ముగుస్తున్న నేప«థ్యంలో సర్వే వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వి«ధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజు 25 ఇళ్లు తగ్గకుండా సర్వే చేయాలని, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్నది, లేనిది సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. -
బిల్ కలెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేత
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జయన్న సస్పెన్షన్ ఉత్తర్వులను అధికారులు ఉపసంహరించారు. మేయర్ ప్రాతినిథ్యం వహించిన 20వ డివిజన్లో సెప్టెంబర్ నెల పింఛన్ పంపిణీలో గోల్మాల్ జరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కమిషనర్ చల్లా ఓబులేసు జయన్నపై సస్పెన్షన్ వేటు చేశారు. మరోసారి తప్పిదం జరగకుండా చూసుకుంటానని జయన్న చెప్పడంతో ఆయన సస్పెన్షన్ రద్దు చేశారు. -
ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
♦ రూ.6వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ♦ బిల్ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు ఖమ్మం : కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్‌ను ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబా బృందం శుక్రవారం వల వేసి పట్టుకుంది. అనంతరం నగరంలోని శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేయడంతోపాటు ఆస్తులను సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. నగరంలోని విలీన పంచాయతీ దానవాయిగూడెం ప్రాంతానికి చెందిన షేక్ ఖాసీం తన అత్తమామల నుంచి పొందిన 80 గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నాడు. విలీన పంచాయతీ కావడంతో కార్పొరేషన్ రికార్డుల్లో నమోదు చేసి.. ఇంటి నంబర్ ఇస్తేనే నీటి పంపు, విద్యుత్ కనెక్షన్ వస్తుంది. దీంతో తనకు ఇంటి నంబర్ ఇవ్వాలని బిల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కోరగా.. దీనికోసం రూ.22వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత మొత్తంలో ఇవ్వలేని ఖాసీం బతిమిలాడటంతో.. చివరకు రూ.12వేలకు అంగీకారం కుదుర్చుకొని.. మూడు నెలల క్రితం రూ.6వేలు లంచం తీసుకున్నాడు. అయినా నంబర్, పంపు కనెక్షన్ ఇచ్చేందుకు జాప్యం చేయడంతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం శుక్రవారం రూ.6వేలు ఖాసీంకు ఇచ్చి.. శ్రీనివాస్‌రెడ్డికి లంచంగా ఇచ్చేందుకు ఫోన్ చేశారు. రెండు బృందాలుగా ఏసీబీ అధికారులు విడిపోయి.. ఒక బృందం ముస్తఫా నగర్, మరో బృందం శ్రీరాంనగర్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద పాగా వేసింది. ఈ క్రమంలో లంచం డబ్బుల కోసం ముస్తఫా నగర్ పెట్రోల్ బంక్ వద్దకు రమ్మని చెప్పడంతో.. ఖాసీం అక్కడికి వెళ్లి శ్రీనివాస్‌రెడ్డికి డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. అనంతరం నగరంలో శ్రీరాం నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, కేసు నమోదు చేస్తామని డీఎస్పీ సాయిబాబా తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఖమ్మం ఎస్సై జి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఎస్సైలు సాంబయ్య, శ్రీనివాసరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కృష్ణ.. కృష్ణా!
అవినీతికి అడ్డాగా మారింది కాకినాడ నగరపాలక సంస్థ. గడచిన ఏడు నెలల వ్యవధిలో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇద్దరు బిల్ కలెక్టర్లు ముడుపులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడమే దీనికి నిదర్శనం. కొత్తగా ఆస్తిపన్ను వేయాలన్నా.. ఖాళీ స్థలాలకు పన్ను కావాలన్నా, ఉన్న పన్నులను సవరించాలన్నా, టైటిల్ డీడ్స్ మారాలన్నా.. ఇక్కడ ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసేశారు రెవెన్యూ అధికారులు. వారు కోరినట్టు ముట్టజెప్పకపోతే ముప్పుతిప్పలు పెట్టించడం వారి నైజం.. ఖాళీ స్థలానికి పన్ను వేసేందుకు రూ.30వేలు తీసుకుంటూ బిల్ కలెక్టర్ కృష్ణ ఏసీబీకి చిక్కడం ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్లో హాట్‌టాపిక్‌గా మారింది. చిక్కుతూనే.. ఒకప్పుడు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన కాకాని సుబ్రహ్మణ్యం, అప్పటి టీపీఓ కొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి ముడుపులు తీసుకుని రైలు, బస్సులో హైదరాబాద్ వెళుతున్నారన్న పక్కాసమాచారంతో కొన్నేళ్ల క్రితం ఏసీబీ వలపన్ని నగదుతో సహా వారిని పట్టుకుంది. అది జరిగిన కొన్నాళ్ల తర్వాత గత ఏడాది ఆగస్టు 10న టైటిల్‌డీడ్ మార్పు కోసం బిల్ కలెక్టర్ విజయ్‌కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.10వేలు ముడుపులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. వీరి వ్యవహారం ఇంకా కొలిక్కిరాకముందే తాజాగా మరో బిల్‌కలెక్టర్ కృష్ణ ఖాళీ స్థలానికి పన్ను వేసేందుకు రూ.80వేలు డిమాండ్ చేసి చివరకు రూ.30వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు.నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టి సొంతంగా ముడుపులు దండుకుంటున్న సిబ్బందిపై ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో సిబ్బంది చివరి క్షణంలో తప్పించుకున్నారన్న అంశం కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి సిబ్బంది ఆటలు కట్టించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు బిల్ కలెక్టర్ కృష్ణ ఏసీబీకి పట్టుబడడంతో ఆశాఖ అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. గతంలో నమోదైన ఏసీబీ కేసులు, ప్రస్తుత కేసుతో సహా వివిధ అంశాలపై వారు చర్చించారు. -
ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్
కాకినాడ : మరో చిరు ఉద్యోగి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్లో బుధవారం చోటు చేసుకుంది. ఖాళీ స్థలానికి పన్ను విధించే అంశంపై కార్పొరేషన్ బిల్లు కలెక్టర్‌ను ఆశ్రయించాడు స్థలం యజమాని. ఆ క్రమంలో రూ. 83 వేలు లంచం ఇస్తే... అలాగే చేస్తాను అని డిమాండ్ చేశారు. దీంతో తాను అంత ఇచ్చుకోలేనని స్థల యజమాని చెప్పడంతో రూ. 30 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. స్థల యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ రంగంలోకి దిగింది. కాకినాడ రైల్వే గేట్ సమీపంలో లంచం తీసుకురావాలని స్థల యజమానికి బిల్లు కలెక్టర్ సూచించాడు. ఆ క్రమంలో లంచం తీసుకుంటూ బిల్లు కలెక్టర్ రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. -
ఉద్యోగిపై తెలుగు తమ్ముళ్ల దాడి
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో పంచాయతీ ఉద్యోగిపై గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాడికి పాల్పడ్డాడు. బిల్ కలెక్టర్ నర్రా శ్రీనివాసరావు ఆదివారం పంచాయతీ కార్యాలయంలో ఉండగా... టీడీపీ స్థానిక అధ్యక్షుడు పులుకూరి రంగ విచక్షణా రహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని కూడా చితక బాదాడు. తమపై రంగ అకారణంగా చేయి చేసుకున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి గల కారణాలు తెలియ రాలేదు. -
లెక్క తప్పిన ఆడిట్
కంచే చేను మేయడమంటే ఇదేనేమో! ఉద్యోగులు ‘లెక్క’ తప్పకుండా చూడాల్సిన ‘ఆడిట్ అధికారులు’ కాసులివ్వలేదని తప్పుడు నివేదికలిచ్చారు. గతంలో చేసిన ఆడిటింగ్నే మళ్లీ చేయాలంటూ... ఓ ఉద్యోగిపై నింద మోపి అతడి సస్పెండ్‌కు కారణమయ్యారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో పురివిప్పిన తాజా అక్రమ బాగోతం ఇది. - ఉన్న బిల్లు పుస్తకాలు లేవని తప్పుడు నివేదిక - దాన్నిబట్టే ఉద్యోగిని బలిచేసిన అధికారులు - లంచం ఇవ్వనందుకే: ఉద్యోగి సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ పాండు. 2010-11కు సంబంధించిన రెండు బిల్ బుక్కులర శీదులతో పాటు డబ్బులను కార్యాలయంలో అతను జమచేశాడు. కానీ ఎలాంటి సొమ్ము పాండు జమ చేయలేదని ఇటీవల ఆడిట్ నిర్వహించిన అధికారులు మున్సిపల్ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా... గత నెల 18 జరిగిన మున్సిపల్ పబ్లిక్ అకౌంట్ కమిటీ సమావేశంలో పాండును సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మేరకు పాండును విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మనస్థానికి గురైన పాండు... బుధవారం కార్యాలయంలోని అన్ని రికార్డులను పరిశీలించారు. పాండుకు సంబంధించిన బుక్ నంబర్ 277, 337 రెండింటికీ కార్యాలయంలో ఐఆర్ రికార్డు లభించింది. వాటిని పరిశీలిస్తే 2010లో అప్పటి అకౌంటెంట్ ఆంజనేయులుకు, 2011లో లత అనే అకౌంటెంట్‌కు బిల్లు బుక్కులకు సంబంధించిన సొమ్ము చెల్లించినట్లుగా ఉంది. కానీ ఆడిటింగ్ అధికారులు మాత్రం ఈ నెంబర్లున్న బిల్ పుస్తకాలు సమర్పించలేదంటూ పాండుపై అభియోగం మోపారు. అతని ఉద్యోగానికే ఎసరు పెట్టారు. రికార్డుల్లో ఉన్నా... తాను ఆడిటింగ్ అధికారులు అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై తప్పడు నివేదికలు ఇచ్చినట్లు మున్సిపల్ బిల్లు కలెక్టర్ పాండు ఆరోపిం చారు. తన రెండు బిల్ బుక్స్కూ సంబంధించిన డబ్బులను అప్పుడే అకౌంట్స్ అధికారులకు చెల్లించి ఐఆర్ రికార్డులో రాయించుకోవడం జరిగిందన్నారు. ఆడిటింగ్ అధికారులు కొంత సొమ్మ ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకు తాను నిరాకరించినందుకు తనపై ఇలా తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. సదరు అధికారులు కార్యాలయంలోనే బిల్ బుక్స్ దాచిపెట్టారన్నారు. అవును... నిజమే... ‘బిల్ కలెక్టర్ పాండుకు సంబంధించిన రెండు బిల్ బుక్స్ పోయినట్లుగా ఆడిటింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అయితే సదరు బుక్స్, సొమ్ము కార్యాలయంలో జమచేసినట్లుగా ఐఆర్ రికార్డు లభించిం ది. ఈ క్రమంలో పాండుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసే లా అనుమతివ్వాలని ఉన్నతాధికారులకు పంపాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. -
విధులను బహిష్కరించిన మున్సిపల్ సిబ్బంది
మెదక్: బిల్ కలెక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ముఖ్తార్‌పై టీఆర్ఎస్ నాయకుడు జీవీ శ్రీనివాస్ బుధవారం దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా గురువారం విధులను బహిష్కరించిన సిబ్బంది అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో బిల్ కలెక్టర్ మృతి
మొయినాబాద్ : గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ బిల్ కలెక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్సై అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దంతోజి శ్రీనివాస్‌రెడ్డి (45) నగరంలోని చందానగర్ మదీనాగూడ ప్రాంతంలో ఉంటూ వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆయన బుధవారం విధులకు వెళ్లి తిరిగి రాత్రి 11 గంటల సమయంలో వికారాబాద్ నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఆయన బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ దాదాపు 100 అడుగుల దూరం వరకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వాహనదారుల సమాచారంతో ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి గురువారం కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య అరుణ, కొడుకు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్లో పన్నుల వసూలు..!
నయా సిస్టమ్ * చేతిమిషన్తో పన్నుల వసూళ్లు, స్పాట్లో రసీదు * అక్రమాలకు చెక్ పెట్టేందుకే అంటున్న అధికారులు * నల్లగొండ జిల్లాలో వచ్చె నెల నుంచి అమలు నల్లగొండ టుటౌన్: కాలం మారుతోంది.. ఇకపై పనులు మానుకొని గంటలకొద్దీ క్యూలో నిలబడి పన్ను చెల్లించాల్సిన పరి(దు)స్థితి లేదు.. అధికారులే మీ ఇంటికి వస్తారు.. ఆస్తి,నల్లా పన్నువసూలు చేస్తారు..కరెంటు బిల్లుమాదిరిగానే వెంటనే రసీదు మీ చేతికి ఇస్తారు..ఇదేంటి అనుకుంటున్నారా..? పన్నుల వసూలుకు మున్సిపల్ యంత్రాంగం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇకపై ఆస్తి, నల్లా పన్నులు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోస మున్సిపాలిటీ పరిధిలోని నివాసాలు, వాణిజ్య సముదాయ కాంప్లెక్స్‌లు, అపార్ట్మెంట్ల అసిస్మెంట్ల నంబర్లను ఆన్లైన్ చేతి మిషన్‌లో లోడ్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి బిల్ కలెక్టర్‌కు చేతి మిషన్.. మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు రసీదు బుక్‌ల ద్వారా బిల్ కలెక్టర్లు పట్టణంలో ఇంటింటికీ తిరిగి ఆస్తిపన్ను వసూలు చేసేవారు. ఇక నుంచి ప్రతి బిల్ కలెక్టర్ ఆన్లైన్ కలెక్షన్ చేయడానికి చేతి మిషన్లు ఇస్తారు. సంబంధిదిత బిల్ కలెక్టర్ నివాసాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల వద్ద నుంచి ఆస్తిపన్ను వసూలు చేసి వెంటనే అక్కడే రసీదులు ఇస్తారు. మరో మిషన్‌ను మున్సిపాలిటీ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంచుతారు. ఎవరైనా ఆస్తిపన్ను చెల్లించడానికి కార్యాలయానికి వస్తే ఇక్కడ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శతంగా వసూళ్ల ప్రక్రియ కొనసాగనుంది. ఏ బిల్ కలెక్టర్ ఏ ఏరియాలో ఉన్నాడు ... ఎంత వసూలు చేశాడు... రోజుకు ఎన్ని నివాసాలు తిరుగుతున్నాడు అనే పూర్తి సమాచారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే ఉండి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బిల్ కలెక్టర్లు వసూళ్లకు అని చెప్పి సొంత పనుల కోసం వెళ్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆన్లైన్ విధానం అమలులోకి వస్తే అలాంటి వారు ఇట్టే దొరికి పొతారు. బీసీల అక్రమాలకు చెక్.. ఆన్లైన్ విధానం అమలైతే బిల్ కలెక్టర్ (బీసీ )ల అక్రమాలకు చెక్ పడనుంది. ఇప్పటి వరకు వాణిజ్య సముదాయాలు, నివాసాలు, అపార్ట్మెంట్ల వారి దగ్గర రికార్డు బుక్‌లో ఉన్న దానికంటే ఎక్కువ వసూలు చేసి ఆ తరువాత రసీదు బుక్‌లో దిద్దిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అదే విధంగా ఒక రోజు రూ.లక్ష ఆస్తిపన్ను వసూలు చేసి అదే రోజు కార్యాలయంలో పూర్తిగా చెల్లించకుండా సొంత ఖర్చులకు కూడా వాడుకునేవారు. ఇక ఇలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడనుంది.