బిల్‌ కలెక్టర్‌ రాసలీలలు | bill collector cheating on women | Sakshi
Sakshi News home page

బిల్‌ కలెక్టర్‌ రాసలీలలు

Published Thu, May 16 2024 11:52 AM | Last Updated on Thu, May 16 2024 11:53 AM

bill collector cheating on women

కేజీఎఫ్‌: కోలారు జిల్లా కేజీఎఫ్‌ తాలూకాలోని రామసాగర గ్రామ పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌ కామాంధునిగా అవతారమెత్తాడు. పనుల కోసం వచ్చే మహిళలను బెదిరించి లోబర్చుకుని కామలీలలకు పాల్పడుతున్నాడు. తోటి మహిళా ఉద్యోగుల మీద కూడా కన్నేశాడు. ఓ కాంట్రాక్టు ఉద్యోగినితో అతగాడు  రాసలీలలు చేసిన వీడియోలు గత రెండు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వివరాలు.. బిల్‌ కలెక్టర్‌ అర్జున్‌ హరికృష్ణ (36) లీలలు ఇవి. బాధితురాలు మాట్లాడుతూ పంచాయతీలో ఉద్యోగం పర్మినెంట్‌ చేయడంతో పాటు, భర్తకు కూడా ఉద్యోగం కల్పిస్తానని తనకు ప్రలోభాలు పెట్టేవాడని తెలిపింది. 

ఒప్పుకోకుంటే తీవ్రచర్యలుంటాయని భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. పంచాయతీ కార్యాలయంలోనే ఈ అకృత్యం చోటుచేసుకుంది. హరికృష్ణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సభ్యులు పిడిఓకు విన్నవించారు. బాధితురాలిని ఒప్పించి ఆమె చేత బేత మంగల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో బిల్‌ కలెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement