త్వరలో టీడీపీకి గుడ్‌బై చెబుతా | Actress Kavitha is going to say goodbye to TDP | Sakshi
Sakshi News home page

త్వరలో టీడీపీకి గుడ్‌బై చెబుతా

Published Thu, Aug 24 2017 2:20 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

త్వరలో టీడీపీకి గుడ్‌బై చెబుతా - Sakshi

త్వరలో టీడీపీకి గుడ్‌బై చెబుతా

అవమానాలు దిగమింగుకుంటూ కొనసాగలేను: సినీ నటి కవిత
 
నెల్లూరు(బృందావనం): తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమని, త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని టీడీపీ నాయకురాలు, సినీ నటి కవిత స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 1983 నుంచి టీడీపీకి  సేవలందించానని చెప్పారు. కానీ టీడీపీ అధినాయకులు తన కష్టాన్ని గుర్తించకపోగా.. ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏ రోజూ కూడా మీడియా ముందుకు రాలేదని చెప్పారు.

‘విశాఖలో నిర్వహించిన మహానాడులో నేను కంటతడి పెట్టడం చూసిన మీడియా పదేపదే ప్రశ్నించడంతో.. నా బాధను వారికి చెప్పాల్సి వచ్చింది. సొంతిల్లు లాంటి టీడీపీని వదిలి రావాలంటే బాధగా ఉంది. కానీ తప్పదు. అవమానాలు దిగమింగుకుంటూ కొనసాగలేను..’ అని కవిత చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement