నరకయాతన | actting in acid | Sakshi
Sakshi News home page

నరకయాతన

Published Sun, Mar 30 2014 2:09 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

నరకయాతన - Sakshi

నరకయాతన

  • మానవ మృగం దాడిలో తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలు
  •  ప్రాణాపాయస్థితిలో యువతి
  •  నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు
  •  మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : ప్రేమ పేరుతో ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. బెదిరించి లొంగదీసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. వీటిని ఆమె లెక్కచేయలేదు. తనకు దక్కని యువతి మరెవరికీ దక్కకుండా అంతమొందించాలనుకున్నాడు. అతడిలో రాక్షసత్వం మేలుకొంది. కొన్ని రోజులుగా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు.

    తల్లితో కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఆమెపై యాసిడ్ పోశాడు. పక్కనే ఉన్న ఆమె తల్లి ఈ ఆకృత్యాన్ని అడ్డుకోవటంతో మరింత ఉన్మాదంతో ఆమెపై కూడా యాసిడ్ పోశా డు. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు జరీనా, హజీదాలకు తీవ్ర గాయాలు కావడంతో నరకయాతన అనుభవిస్తున్నారు.

    జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరానికి పాల్పడిన సుభాని తనపై కూడా యాసిడ్ పోసుకున్నాడు. జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యుల సలహా మేర కు శనివారం బాధితులిద్దరిని  పోలీ సులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో హజీదా ము ఖం, శరీరం చాలా వరకు కాలిపోవడంతో ప్రాణాపా య స్థితిలో ఉంది. ఈ హఠాత్పరిణామంతో బాధిత కుటుంబం ఒక్కసారిగా నివ్వెరపాటుకు గురైంది.
     
    బాధితులను పరామర్శించిన ఎస్పీ  
     
    ఎస్పీ జె.ప్రభాకరరావు శనివారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి బాధితులు జరీనా, హజీదాలను పరామర్శించారు. ఈ ఘటన గురించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హా మీ ఇచ్చారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన మానవ మృగంపై  307, నిర్భయ చట్టం కింద కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. తల్లీకూతుళ్ల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల వద్ద ఆరా తీశారు. నింది తుడు సుభాని వద్ద కూడా వివరాలు సేకరించారు. నిందితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట బందరు డీఎస్పీ డాక్టర్ కె. వి.శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ పి.మురళీధర్, ఇనగుదురుపేట సీఐ కె.సాయిప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. కాగా ఈ ఘటనపై బాధితురాలు హజీదా ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
     
    నేతల పరామర్శ
     
    యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న జరీనా, హసీనాల ను పలు పార్టీల నాయకులు శనివారం పరామర్శించారు. బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరా వు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్‌సలార్ దాదా, టీడీపీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు తదితరులు బాధితులను కలిసి ఈ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగి నిందితుడికి శిక్ష పడేంతవరకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. నిందితుడికి శిక్షపడేలా పోలీ సులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement