గోరంట్ల, న్యూస్‌లైన్ : వాతావరణ బీమా పరిహారం పంపిణీ జాప్యాన్ని నిరసిస్తూ చిలమత్తూరు మండలానికి చెందిన వందలాదిమంది రైతులు శనివారం గోరంట్లలోని ఏడీసీసీ బ్యాంకును ముట్టడించారు. 2012లో వేరుశనగ పంట నష్టం జరిగిన చిలమత్తూరు మండలం సోమఘట్ట, కోడూరు, గోరంట్ల మండలం బూదిలి సహకార సంఘం పరిధిలోని 1397 మంది రైతులకు ఎకరాకు రూ.1900 చొప్పున వాతావరణ బీమా కింద రూ. 89 లక్షలు విడుదలైంది.
బ్యాంకర్లు, సంబంధిత సహకార సంఘం సీఈఓ నిర్లక్ష్యం మూలంగా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందలేదు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు వాతావరణ బీమా పరిహరం అందించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు. చివరకు పోలీసుల సహకారంతో బీమా పరిహారం పంపిణీ అందజేసేందుకు బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఏడీసీసీ బ్యాంకు ముట్టడి
Published Sun, Sep 8 2013 5:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement