సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో ఆరు సంవత్సరాల తర్వాత అభివృద్ధి కమిటీ సమావేశం(డీఆర్సీ) నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ సందర్బంగా అధికారులతో నిర్వహించిన డీఆర్సీ మీటింగ్‌లో జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని తెలిపారు. జిల్లాలో ఈ నెలాఖరు వరకు వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తాం. అలాగే కడప స్టీల్ ప్లాంట్, రాజోలు ఆనకట్ట, కుందు లిఫ్ట్ ఇరిగేషన్‌లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌లో శంకుస్థాపన చేస్తారు.
గత అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎందుకు డీఆర్సీ కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో టీడీపీ నేతలు భారీ అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు 100 కోట్ల మేర బకాయిలు ఉన్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధే ద్యేయంగా అధికారులు కృషి చేయాలని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా ప్రతినిధులను కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment