వరంగల్‌అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఆదర్శ రైతులుగా పనిచేస్తున్న వారి విద్యార్హతలను బట్టి వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) లుగా ప్రభుత్వం నియమించాలని ఆదర్శ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.ఉమ్లా నాయక్ డిమాండ్ చేశారు. జేడీఏ కార్యాలయంలో సోమవారం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేడీఏ జి.రామారావుకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదర్శ రైతులకు ఉద్యోగభద్రతతోపాటు భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆదర్శ రైతు నెల జీతం *1000 నుంచి *6900కు పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు జారీ చేయాలన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆదర్శరైతుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఆదర్శ రైతులను నియమించిన దేవుడు దివంగత వైఎస్‌ఆర్ అని ఉమ్లా కొనియూడారు. ఆద ర్శరైతు సంఘం స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు న్యాయం సంపత్‌రెడ్డి, జిల్లా నాయకులు కడారి సమ్మయ్య, రాగి ఎల్లారెడ్డి, తిరుపతి, రవి, మాణ్యి, చందర్‌రెడ్డి, సత్యనారాయణ, వీరన్న నాయక్ పాల్గొన్నారు.
విద్యార్హత ఆధారంగా ఏఈఓలుగా నియమించాలి
Published Tue, Feb 4 2014 1:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement