నెల్లూరు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడిగా అక్బర్ బాషా ఎన్నిక | Akbar basha elected Nellore zilla parishad co-opted member | Sakshi
Sakshi News home page

నెల్లూరు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడిగా అక్బర్ బాషా ఎన్నిక

Published Sun, Jul 20 2014 1:32 PM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Akbar basha elected Nellore zilla parishad co-opted member

నెల్లూరు : నెల్లూరు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అక్బర్ బాషా ఎన్నికయ్యారు. జడ్పీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తరఫున కో ఆప్షన్ సభ్యులుగా బరిలో దిగిన వారికి సమానంగా ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు.

అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అక్భర్ బాషాను విజయం వరించింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీలు ఉన్నాయి. వైఎస్ఆర్ సిపి నుంచి 8 మంది సభ్యులు టిడిపికి మద్దతు పలకడంతో ఇరు పక్షాల బలం సమానమైంది.  దాంతో అధికారులు లాటరీ ద్వారా కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement