Akbar basha
-
48 గంటల్లో మా భూమిని మాకు అప్పగించారు
కడప రూరల్: పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న మా భూమిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 48 గంటల్లో ఇప్పించారని, ఆయన తమ కుటుంబానికి దేవుడి కంటే ఎక్కువ అని వైఎస్సార్ జిల్లా దవ్వూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన అక్బర్‌బాషా, ఇతని భార్య అఫ్సానా, సోదరుడు ఎంఏ అజీబ్లు అన్నారు. ఆదివారం సాయంత్రం వారు కడపలోని వైఎస్సార్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి తాను ఫేస్బుక్లో పెట్టిన వీడియోకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎంఓ కార్యాలయం స్పందించిన తీరు అద్భుతమని అక్బర్ బాషా పేర్కొన్నారు. జిల్లా అధికారులు.. పార్టీ నేతలతో మాట్లాడి న్యాయం చేశారన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, కడప నగర మేయర్ సురేష్‌బాబు, వరికూటి ఓబుల్‌రెడ్డి అందరినీ సమన్వయం చేసి ఎలాంటి షరతులు లేకుండా తమ భూమి తమకు వచ్చేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల నాయకులు, మత పెద్దలు, మీడియాకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోణంలో చూసి దీన్ని రాద్ధాంతం చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. తాను తిరుపాల్‌రెడ్డిపై ఆరోపణలు చేసినప్పటికీ, ఆయన పెద్ద మనసుతో స్పందించి తనకు న్యాయం చేశారన్నారు. -
సహకార సంఘాల బలోపేతమే లక్ష్యం
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ ఎండీ అక్బర్‌బాషా చెల్లూరు (రాయవరం) : సహకార సంఘాల బలోపేతమే లక్ష్యంగా సొసైటీ పాలకవర్గాలు పనిచేయాలని ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ మేనేజింగ్ డైరెక్టరు అలీ అక్బర్‌బాషా అన్నారు. మండలంలోని చెల్లూరు సొసైటీ వద్ద అధ్యక్షుడు నరాల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ర్‌్టరంలో 6,150 సహకార సంఘాల్లో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలకవర్గాలకు మంజూరు చేసిన అటానమీ అధికారాలను సద్వినియోగం చేసుకుని సొసైటీలను లాభాల బాటలో నడిపించాలన్నారు. జిల్లా సహకార అధికారిణి టి.ప్రవీణ మాట్లాడుతూ సొసైటీలకు అవసరమైన గిడ్డంగులకు వనరులు సమకూర్చడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామన్నారు. సహకార శాఖ రాజమండ్రి డీఆర్ కె.కృష్ణశృతి, కో ఆపరేటివ్ ఎడ్యుకేష¯ŒS అధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, సొసైటీ సీఈవో జీవీవీ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదుగురు రైతులకు ప్రోత్సాహకంగా యూరియా బస్తాలను ఉచితంగా అందజేశారు. సొసైటీ పాలకవర్గ సభ్యులు దేవు శివానందరావు, టీవీవీ సత్యనారాయణ, గొరితి సత్యం ఎ¯ŒS.వెంకటరావు, మేడిశెట్టి వీరవెంకటసత్యనారాయణ, పంతగడ నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడిగా అక్బర్ బాషా ఎన్నిక
నెల్లూరు : నెల్లూరు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అక్బర్ బాషా ఎన్నికయ్యారు. జడ్పీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తరఫున కో ఆప్షన్ సభ్యులుగా బరిలో దిగిన వారికి సమానంగా ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అక్భర్ బాషాను విజయం వరించింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీలు ఉన్నాయి. వైఎస్ఆర్ సిపి నుంచి 8 మంది సభ్యులు టిడిపికి మద్దతు పలకడంతో ఇరు పక్షాల బలం సమానమైంది. దాంతో అధికారులు లాటరీ ద్వారా కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేశారు.