- ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ ఎండీ అక్బర్‌బాషా
సహకార సంఘాల బలోపేతమే లక్ష్యం
Published Tue, Nov 15 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
చెల్లూరు (రాయవరం) :
సహకార సంఘాల బలోపేతమే లక్ష్యంగా సొసైటీ పాలకవర్గాలు పనిచేయాలని ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ మేనేజింగ్ డైరెక్టరు అలీ అక్బర్‌బాషా అన్నారు. మండలంలోని చెల్లూరు సొసైటీ వద్ద అధ్యక్షుడు నరాల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ర్‌్టరంలో 6,150 సహకార సంఘాల్లో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలకవర్గాలకు మంజూరు చేసిన అటానమీ అధికారాలను సద్వినియోగం చేసుకుని సొసైటీలను లాభాల బాటలో నడిపించాలన్నారు. జిల్లా సహకార అధికారిణి టి.ప్రవీణ మాట్లాడుతూ సొసైటీలకు అవసరమైన గిడ్డంగులకు వనరులు సమకూర్చడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామన్నారు. సహకార శాఖ రాజమండ్రి డీఆర్ కె.కృష్ణశృతి, కో ఆపరేటివ్ ఎడ్యుకేష¯ŒS అధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, సొసైటీ సీఈవో జీవీవీ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదుగురు రైతులకు ప్రోత్సాహకంగా యూరియా బస్తాలను ఉచితంగా అందజేశారు. సొసైటీ పాలకవర్గ సభ్యులు దేవు శివానందరావు, టీవీవీ సత్యనారాయణ, గొరితి సత్యం ఎ¯ŒS.వెంకటరావు, మేడిశెట్టి వీరవెంకటసత్యనారాయణ, పంతగడ నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement