societys
-
పాలక వర్గాలదే కీలక బాధ్యత
జిల్లా సహకార అధికారిణి ప్రవీణ పెదపూడి : సహకార సంఘాల అభివృద్ధిలో పాలకవర్గాలదే కీలక బాధ్యతని జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ అన్నారు. స్థానిక పీఏసీఎస్‌లో బుధవారం సొసైటీ అ««దl్యక్షుడు పుట్టా గంగాధర్ చౌదరి ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడు తూ స్వచ్ఛ భారత్ చేపట్టాలని సూచించారు.జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అనంతరం ముగ్గురు సీనియర్ రైతులను సత్కరించారు. డివిజ¯ŒS సహకార అధికారి కె.పద్మ, రాష్ట్ర సహకార యూనియ¯ŒS విద్యాధికారి ఆది మూలం వెంకటేశ్వరరావు, జిల్లా అడిట్ అధికారి వి.ఫణికుమార్, జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ ఎ¯ŒSఎస్ఎ¯ŒSబీకే దుర్గాప్రసాద్, సీఈఓ బి.రాజుబాబు, పెద్దాడ సాగునీటి డీసీ చైర్మ¯ŒS మార్ని రాంబాబు, స్థానిక సీఈఓ వాసంశెట్టి గోవిందరాజులు, డీసీసీబీ బ్రాంచి మేనేజర్ ఎం.శ్రీనివాస్, పెదపూడి సా గునీటి సంఘం అ««దl్యక్షుడు కోరా రామన్న చౌదరి పాల్గొన్నారు. -
సహకార సంఘాల బలోపేతమే లక్ష్యం
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ ఎండీ అక్బర్‌బాషా చెల్లూరు (రాయవరం) : సహకార సంఘాల బలోపేతమే లక్ష్యంగా సొసైటీ పాలకవర్గాలు పనిచేయాలని ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ మేనేజింగ్ డైరెక్టరు అలీ అక్బర్‌బాషా అన్నారు. మండలంలోని చెల్లూరు సొసైటీ వద్ద అధ్యక్షుడు నరాల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ర్‌్టరంలో 6,150 సహకార సంఘాల్లో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలకవర్గాలకు మంజూరు చేసిన అటానమీ అధికారాలను సద్వినియోగం చేసుకుని సొసైటీలను లాభాల బాటలో నడిపించాలన్నారు. జిల్లా సహకార అధికారిణి టి.ప్రవీణ మాట్లాడుతూ సొసైటీలకు అవసరమైన గిడ్డంగులకు వనరులు సమకూర్చడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామన్నారు. సహకార శాఖ రాజమండ్రి డీఆర్ కె.కృష్ణశృతి, కో ఆపరేటివ్ ఎడ్యుకేష¯ŒS అధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, సొసైటీ సీఈవో జీవీవీ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదుగురు రైతులకు ప్రోత్సాహకంగా యూరియా బస్తాలను ఉచితంగా అందజేశారు. సొసైటీ పాలకవర్గ సభ్యులు దేవు శివానందరావు, టీవీవీ సత్యనారాయణ, గొరితి సత్యం ఎ¯ŒS.వెంకటరావు, మేడిశెట్టి వీరవెంకటసత్యనారాయణ, పంతగడ నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.