సాక్షి, అమరావతి: దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ సర్వీసెస్ కంపెనీ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అలీబాబా సహకారం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సైమన్ హూ స్పందిస్తూ.. భారత్‌లో తమరెండో డేటా సెంటర్‌ను ఈ ఏడాది చివరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. మరింత త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.
వ్యవసాయంలో సూక్ష్మ పోషకాలు, క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులను అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా తయారుచేయాలన్నది తమ ఉద్దేశమని, ఆ దిశగా ఎనలిటిక్స్ రంగం లో అలీబాబా సంస్థ సహకారం కోరుతున్న ట్లు తెలిపారు. ఏపీలో ఎంఎస్‌ఎంఇ పరిశ్ర మలు, వాణిజ్య సంస్థల ఉత్పాదకత పెంచ డంలో అలీబాబా మద్దతు కావాలని కోరారు. సైమన్ స్పందిస్తూ.. తాము చైనాలోని షాంఘైలో ఇదే తరహా సేవలు అందిస్తున్నామని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి సహకారంపై అధ్యయనం చేస్తామని వివరించారు.
మహీంద్ర సంస్థకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్ర గ్రూపు వ్యాపార, సేవా కార్యక్రమాలను విస్తరించాలని చంద్రబాబు కోరారు. దావోస్‌లో మహీంద్ర గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రతో సీఎం భేటీ అయ్యారు. సెజ్ తరహాలో ప్రపంచ శ్రేణి పారిశ్రామిక నగరం ఏపీలో ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్ తరహాలో అమరావతి, విశాఖ, హిందూపురంలలో మైండ్ స్పేస్ భవనాలు నిర్మించాలని రహేజా మైండ్ స్పేస్ అధిపతి రవి రహేజాను బాబు కోరారు. గురువారం నాటి భేటీల్లో ముందుగా రవి రహేజాతో చర్చలు జరిపారు. ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ ‘డస్సాల్ట్’ గ్రూపు సీఈవో బెర్నార్డ్ చార్లెస్‌తో సీఎం సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment