Alibaba Cloud
-
‘అలీబాబా’తో చైనాకు డేటా
న్యూఢిల్లీ: చైనా ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. భారత్‌తో నేరుగా తలపడలేని డ్రాగన్ దేశం హైబ్రిడ్ యుద్ధానికి (మిలటరీయేతర సాధనాలతో ప్రత్యర్థులపై పట్టు బిగించడం) తెరతీసింది. దేశంలో ప్రముఖుల కార్యకలాపాలపై కన్నేసి సైబర్ నేరాలకు పాల్పడుతోంది. భారత్‌లో 72 సర్వర్ల ద్వారా వినియోగదారుల డేటా చైనాకి చేరిపోతోంది. చైనాకు చెందిన టెక్నాలజీ గ్రూప్ అలీబాబా సంస్థ క్లౌడ్ డేటా సర్వర్ల ద్వారా మన దేశంలో ప్రముఖులకు సంబంధించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు చైనాకి చేరిపోతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌కి వెల్లడించారు. మన దేశ వాణిజ్య రంగంలో అలీబాబా క్లౌడ్ డేటాకి ఆదరణ ఎక్కువగా ఉంది. యూరోపియన్ సర్వర్ల కంటే అలీబాబా తక్కువ ధరకే సర్వర్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఆ సంస్థే భారత్ నుంచి డేటా చౌర్యానికి పాల్పడుతోందని తేలింది. 72 డేటా సర్వర్ల ద్వారా చైనాకి సమాచారం వెళుతున్నట్టు ఇప్పటివరకు గుర్తించామని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పథకం ప్రకారమే చైనా కుట్ర తమ దేశానికి చెందిన టెక్నాలజీ సంస్థల ద్వారా చైనా అధికారులు భారీ ఎత్తున డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ‘ఇదంతా అలీబాబా సంస్థ పథకం ప్రకారమే చేస్తోంది. మొదట ఫ్రీ ట్రయల్ అని కంపెనీలకు ఎర వేస్తుంది. కంపెనీలు అలీబాబా సర్వర్లని సబ్‌స్క్రైబ్ చేసుకోగానే కీలకమైన సమాచారాన్నంతా చైనాలో మారుమూల సర్వర్లకు చేరవేస్తోంది’ అని ఆ వర్గాలు తెలిపాయి. త్వరలో సమగ్ర విచారణ చైనా సైబర్ చౌర్యంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో సమగ్రమైన విచారణ చేపట్టనుంది. డ్రాగన్ దేశం హైబ్రిడ్ యుద్ధానికి తెరలేపిన నేపథ్యంలో చైనాకు చెందిన 200 యాప్‌లను కేంద్రం నిషేధించినట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూనే దేశంలో ప్రముఖుల డేటా చౌర్యానికి పాల్పడుతూ ఉండడంతో కేంద్రం లోతైన దర్యాప్తుని చేపట్టనుంది. -
రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సహకారం!
సాక్షి, అమరావతి: దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ సర్వీసెస్ కంపెనీ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అలీబాబా సహకారం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సైమన్ హూ స్పందిస్తూ.. భారత్‌లో తమరెండో డేటా సెంటర్‌ను ఈ ఏడాది చివరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. మరింత త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయంలో సూక్ష్మ పోషకాలు, క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులను అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా తయారుచేయాలన్నది తమ ఉద్దేశమని, ఆ దిశగా ఎనలిటిక్స్ రంగం లో అలీబాబా సంస్థ సహకారం కోరుతున్న ట్లు తెలిపారు. ఏపీలో ఎంఎస్ఎంఇ పరిశ్ర మలు, వాణిజ్య సంస్థల ఉత్పాదకత పెంచ డంలో అలీబాబా మద్దతు కావాలని కోరారు. సైమన్ స్పందిస్తూ.. తాము చైనాలోని షాంఘైలో ఇదే తరహా సేవలు అందిస్తున్నామని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి సహకారంపై అధ్యయనం చేస్తామని వివరించారు. మహీంద్ర సంస్థకు ఆహ్వానం ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్ర గ్రూపు వ్యాపార, సేవా కార్యక్రమాలను విస్తరించాలని చంద్రబాబు కోరారు. దావోస్‌లో మహీంద్ర గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రతో సీఎం భేటీ అయ్యారు. సెజ్ తరహాలో ప్రపంచ శ్రేణి పారిశ్రామిక నగరం ఏపీలో ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్ తరహాలో అమరావతి, విశాఖ, హిందూపురంలలో మైండ్ స్పేస్ భవనాలు నిర్మించాలని రహేజా మైండ్ స్పేస్ అధిపతి రవి రహేజాను బాబు కోరారు. గురువారం నాటి భేటీల్లో ముందుగా రవి రహేజాతో చర్చలు జరిపారు. ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ ‘డస్సాల్ట్’ గ్రూపు సీఈవో బెర్నార్డ్ చార్లెస్‌తో సీఎం సమావేశం నిర్వహించారు. -
ఇండియాలో ఆలీబాబా క్లౌడ్ డేటా సెంటర్లు
ముంబై: అంతర్జాతీయ షాపింగ్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌నకు చెందిన ఆలీబాబా క్లౌడ్ దేశీయంగా డేటా సెంటర్లను ప్రారంభించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ , ఇండోనేషియాలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లోని ముంబైలో రెండు, ఇండోనేషియాలో జకార్తాలో ఒక కొత్త డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆలీబాబా క్లౌడ్ ప్రకటించింది. భారతదేశం మరియు ఇండోనేషియాలో డేటా సెంటర్లను స్థాపించి ఈ ప్రాంతం మరియు ప్రపంచవ్యాప్తంగా మా స్థానం మరింత బలపడుతుందని అలీబాబా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హు చెప్పారు. మలేషియాలో ఇటీవలే ప్రకటించిన సమాచార కేంద్రంతో పాటు ఆసియాలో ఆలీబాబా క్లౌడ్ సేవల్ని , కంప్యూటింగ్ వనరులను పెంచుకోనుంది. చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు (ఎస్ఎంఈ) శక్తివంతమైన, స్కేలబుల్, సరసమైన ధరలో, సమర్థవంతమైన , సురక్షిత క్లౌడ్ సామర్ధ్యాలతో సేవల్ని అందించనున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో మూడు కొత్త డేటా కేంద్రాలతో అలీబాబా క్లౌడ్ మొత్తం డేటా సెంటర్ల సంఖ్య 17కి పెరిగనుంది. ముఖ్యంగా చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాలో ఈ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఆలీబాబా యాక్టివ్ యూజర్ బేస్దాదాపు 500 మిలియన్లుగా ఉంది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ గ్లోబల్ క్లచ్ ఎక్స్ఛేంజ్ (జిసిఎక్స్) తో భాగస్వామ్యంతో ఆలీబాబా క్లౌడ్ పనిచేస్తోంది. జిసిఎక్స్ క్లౌడ్ ఎక్స్ ఫ్యూజన్ ద్వారా ప్రత్యక్షంగా వేల సంఖ్యలో భారతీయ వినియోగదారులకు సేవలను అందిస్తోంది.