రేపు ఎంసెట్ | all arrangements are completed for emcet exams | Sakshi
Sakshi News home page

రేపు ఎంసెట్

Published Wed, May 21 2014 2:26 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

all arrangements are completed for emcet exams

 ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 22న ఎంసెట్-2014 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ జెడ్.రమేష్‌బాబు తెలిపారు.

 =ఎంసెట్ నిర్వహణకు ఒంగోలు నగర, పరిసర ప్రాంతాల్లోని పది ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 =ఇంజినీరింగ్ విద్యార్థులకు పది పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థులకు మూడు కేంద్రాలు కేటాయించారు.
 =ఎంసెట్‌కు మొత్తం 10,862 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అత్యధికంగా 8,745 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి 2,117 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
 =ఇంజినీరింగ్ కోర్సుల విద్యార్థులకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
 =ఎంసెట్-2014 పరిశీలకునిగా హైదరాబాద్ జేఎన్‌టీయూ నుంచి ప్రొఫెసర్ వస్తున్నారు.
 =పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

 పరీక్ష కేంద్రాల్లో జామర్లు
 ఎంసెట్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌కు చెక్ పెట్టేందుకు పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ర్యాంకులు సాధిస్తున్న వారి ఆటలు కట్టించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులో ప్రవేశం విషయంలో ర్యాంకులు సాధించేందుకు విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవలే మెడిసిన్, పీజీ ప్రవేశాల్లో అవకతవకలు జరగడంతో ఆ పరీక్షను గవర్నర్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలో ఎటువంటి  అక్రమాలకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు రహస్యంగా తెచ్చుకునే ఎలక్ట్రానిక్ పరికరాలకు సిగ్నల్ అందకుండా జామర్లు అడ్డుకుంటాయి.

 విద్యార్థులకు సూచనలు:
 = విద్యార్థులు సమాధానాలను బబుల్ చేసేందుకు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌ను వినియోగించాలి.
 = విద్యార్థులు హాల్ టికెట్ మీద ఫొటో లేకపోతే మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలను గజిటెడ్ అధికారితో ధ్రువీకరించుకొని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి.
 = ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కులధ్రువీకరణ పత్రాలను అటెస్టేషన్ చేయించి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌కు ఇవ్వాలి. చీఫ్‌లు ఆ కులధ్రువీకరణ పత్రాలను విద్యార్థుల నామినల్ రోల్స్‌లో అంటించి పంపించాలి.
 = పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ప్రశ్నపత్రాలను తమ వెంట తీసుకెళ్లవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement