సాక్షి, విజయవాడ: ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అంతేకాక కాంట్రాక్టు ఉద్యోగులవి న్యాయమైన కోరికలని తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హమీలను అమలు చెయ్యాలని అఖిలపక్షం పేర్కొంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, జనసేన ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనకు మద్దతును ప్రకటించాయి.
వారి సమస్యలను వెంటనే పరిష్కరించబోతే అన్ని పార్టీలు కలిసి ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించాయి. విద్యుత్ కార్మికుల సమస్యపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్షం ధ్వజమెత్తింది. వారి పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరు మంచిదికాదు.. తక్షణమై విద్యుత్ కార్మికులను పిలిచి సంప్రదింపులు జరపాలని సూచించాయి. కార్మికుల ఓర్పుని పరిక్షిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అఖిలపక్షం తెలిపింది. రేపు(ఫిబ్రవరి 23న) 13 జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ ధర్నాలకు దిగుతామని అన్నిపార్టీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
Comments
Please login to add a commentAdd a comment