electrical contract employees
-
విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా
-
‘కార్మికుల సమస్యపై చంద్రబాబు నిర్లక్ష్యం..’
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అంతేకాక కాంట్రాక్టు ఉద్యోగులవి న్యాయమైన కోరికలని తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హమీలను అమలు చెయ్యాలని అఖిలపక్షం పేర్కొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, జనసేన ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనకు మద్దతును ప్రకటించాయి. వారి సమస్యలను వెంటనే పరిష్కరించబోతే అన్ని పార్టీలు కలిసి ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించాయి. విద్యుత్ కార్మికుల సమస్యపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్షం ధ్వజమెత్తింది. వారి పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరు మంచిదికాదు.. తక్షణమై విద్యుత్ కార్మికులను పిలిచి సంప్రదింపులు జరపాలని సూచించాయి. కార్మికుల ఓర్పుని పరిక్షిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అఖిలపక్షం తెలిపింది. రేపు(ఫిబ్రవరి 23న) 13 జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ ధర్నాలకు దిగుతామని అన్నిపార్టీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు విద్యుత్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెరిగాయి. కనీస మూలవేతనంపై 12 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను గత మే 1 నుంచి చెల్లించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కార్మికులు గత ఏప్రిల్ 27 నుంచి మే 13 వరకు సమ్మె నిర్వహిం చారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ విద్యుత్ సంస్థలు.. కార్మిక జేఏసీతో గత నెల 13న ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో కార్మికులు సమ్మె వీడి విధుల్లోకి చేరారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందే కార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేశారు. కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న సొమ్మునే బీమా ప్రీమియం గా చెల్లించాలని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు ఉండదని హామీ ఇచ్చారు. ఇకపై కార్మికులను కాంట్రాక్టర్లు నేరుగా తొలగించకుండా నిబంధనలు తెచ్చారు. సంబంధిత అధికారి రాతపూర్వకంగా ఆ ప్రక్రియను జరపాల్సి ఉంటుంది. కార్మికుల పనుల ను కాంట్రాక్టర్లే పర్యవేక్షిస్తారు. కార్మికచట్టాల మేర కు కార్మికుల రికార్డులను సైతం కాంట్రాక్టర్లు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జీవో 3 ప్రకారం వేతనాలు చెల్లిస్తుండగా, జీవో 11 ఆధారంగా చెల్లించే విషయాన్ని పరిశీలిస్తామనే హామీ ప్రస్తావన ఉత్తర్వుల్లో లేదు. 12 శాతం ప్రత్యేక అలవెన్స్‌తో ఒనగూరే ప్రయోజనమేమీ లేదని కార్మిక నేతలు నాగరాజు, సాయిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన
కడప అగ్రికల్చర్ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతు చేస్తున్న నిరసన పరంపర కొనసాగుతోంది. సోమవారం కడప నగరంలోని శంకరాపురం వద్ద ఉన్న ట్రాన్స్‌కో సీఈ కార్యాలయం వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక యూనియన్ జేఏసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి, కో చైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేయాల్సి వస్తోందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కనీసవేతనాలు నెలనెల ఇవ్వకుండా, పెంచకుండా వేధించడం తగదన్నారు. కార్మికులతో ఊడిగం చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. శాసన సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు ఓ పార్టీకి చెందిన వారని చెప్పడం దుర్మార్గం కాదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. మంగళవారం ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలకు పిలుస్తున్నారని, ఆ చర్చలు సఫలీకృతమయ్యేలా చూడాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కనుక వ్యతిరేకిస్తే పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ భిక్షాటనలో జేఏసీ ఉపాధ్యక్షులు గణేష్, ఈశ్వరయ్య, మురళి, సాయి సుబ్బరాయుడు,పి కిషోర్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి ఏజా తదితరులు పాల్గొన్నారు.కాగా ఏడు రోజులుగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని బిజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్‌నాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు సానపురెడ్డి రవిశంకరరెడ్డి అన్నారు. కార్మికులు చేస్తున్న ఆందోళన శిభిరానికి వచ్చి మద్ధతు పలికారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల రిలేదీక్షలు .
గుణదల సబ్‌స్టేషన్ వద్ద ప్రారంభం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ విజయవాడ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు రోడ్డెక్కారు. రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీరు బుధవారం గుణదల ట్రాన్స్‌కో నిలయం వద్ద ఏలూరు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సామూహిక రిలేదీక్షలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కాంట్రాక్టు కార్మికులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కన్వీనర్ కాశీ మధుబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, జిల్లాలో 1200 మంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యుత్ శాఖలో థర్డ్‌పార్టీ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబూ.. మోసం చేయొద్దు... ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సీపీఎం మద్దతు ప్రకటించింది. గుణదల సబ్‌స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమం వద్దకు ఆ పార్టీ నగర కార్యదర్శి సీహెచ్ బాబూరావు వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని గాలికొదిలి కార్మికుల పొట్టలు కొడుతున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను దశలవారీగా తొలగించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయొద్దని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిరవధిక సమ్మెకు దిగిన కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉండి పోరాటంలో పాల్గొంటామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి... న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే పర్మినెంటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు డిమాండ్ చేశారు. గుణదల సబ్‌స్టేషన్ వద్ద రిలేదీక్షా శిబిరంలో కూర్చుని వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు తమ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి.. కార్మికులకు న్యాయం జరిగేవిధంగా కృషిచేస్తారని చెప్పారు. అనంతరం తొలిరోజు రిలేదీక్షలను ఆయన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాదల శివరామకృష్ణ, జిల్లా జేఏసీ నాయకులు టీఎన్ బసవేశ్వరరావు, కన్వీనర్ ఆర్.ప్రవీణ్, జిల్లా నాయకుడు బీపీకే చంద్రం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ మద్దతు ప్రకటించారు. -
అసెంబ్లీలో నిలదీస్తాం: వైఎస్ జగన్
-
అసెంబ్లీలో నిలదీస్తాం: వైఎస్ జగన్
* చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం * ప్రజలకు భరోసా ఇవ్వలేని వ్యక్తికి ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు? * రైతన్నలు, డ్వాక్రా మహిళలు, అవ్వాతాతలు, కార్మికులను బాబు మోసం చేశారు * రైతులకు వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తే.. బాబు పదేళ్ల బకాయిలు కట్టాలంటూ బిల్లులు ఇవ్వడం దారుణం * విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేలా పోరాటం చేస్తాం సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘నోటి వెంట ఒక మాటొస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం, భరోసా ప్రజలకు ఇవ్వలేని వ్యక్తి సీఎం స్థానంలో ఎందుకు కూర్చోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమ లుచేయకుండా రైతన్నలను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, కాంట్రాక్టు ఉద్యోగ సోదరులను, అవ్వా తాతలు అందర్నీ మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే. ఇటువంటి వ్యక్తి సీఎం అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును గట్టిగా నిలదీస్తాం. అప్పటికీ ఆ మనిషికి సిగ్గురాకపోతే... మీకు నేను అండగా ఉంటాను. మీ తరపున పోరాడుతా. మరో నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ అందరి సమస్యలు పరిష్కరిస్తానని నేను భరోసా ఇస్తున్నా ను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. గుంటూరు మాజీ ఎంపీపీ, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పెద్ద కుమారుడు రాజమన్నార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన మంగళవారం గుంటూరు వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి గుంటూరు వరకు రోడ్డు మార్గంలో వెళ్లిన జగన్‌ను దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వారి సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌పై సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు విజయవాడ జింఖానా గ్రౌండ్లో చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తమకు ఉచిత కరెంటును అందిస్తే ప్రస్తుతం చంద్రబాబు ఎనిమిదేళ్ల నుంచి కరెంటు బకాయిలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారని తాడేపల్లిలో రైతులు, మహిళలు జగన్మోహన్రెడ్డిని కలిసి వాపోయారు. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని జగన్మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. భూ సమీకరణపై రైతుల ఆవేదన తమ భూములన్నింటినీ సర్కార్ లాక్కుంటే రో డ్డున పడతామని, సారవంతమైన భూములను రాజధాని భూ సమీకరణకు ఇచ్చేది లేదని రాజ ధాని భూ సమీకరణ వ్యతిరేక గ్రామాల రైతులు జగన్మోహన్రెడ్డిని కలసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి నిడమర్రు, కురగల్లు, పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో మంగళగిరి వద్ద జగన్‌కు విజ్ఞాపనలు అందించారు. రైతుల తరపున అసెంబ్లీలో పోరాడుతామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని విద్యార్థులకు ఆయన సూచించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కరకట్టపై తమ ఇళ్లను అధికారులు తొలగించే ప్రయత్నంచేస్తున్నారని పలువురు మహిళలు వాపోయారు. ఇక్కడ ఇళ్లు తొలగిస్తే మీకు ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వాన్ని కోరతానని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే వైఎస్సార్సీపీ నాయకులు వంగవీటి రాధా, పి.గౌతమ్‌రెడ్డి మీ తరపున పోరాడుతారని జగన్ వారికి ధైర్యం చెప్పారు. జగన్‌వెంట ఎమ్మెల్యేలు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జలీల్ ఖాన్, మహ్మద్ ముస్తాఫా, పార్టీరాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, తలశిల రఘురామ్, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కొలుసు పార్ధసారధి, మర్రి రాజశేఖర్, గుంటూ రు నగర అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్‌రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ర్ట అధ్యక్షులు మేరుగ నాగర్జున, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. -
మోసం చేయడం చంద్రబాబు ప్రవృత్తి
రైతుల నుంచి మహిళల వరకు అందరినీ సీఎం మోసం చేశారు విద్యుత్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సభలో వైఎస్ జగన్ అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు అన్ని వర్గాలను మోసం చేస్తోంది. కడుపుమండిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం...’ అని వైఎస్సార్ సీపీ అధినే త వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. గాంధీ నగర్‌లోని జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. విజయవాడ : ‘విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల నుంచి డ్వాక్రా మహిళలు, రైతుల వరకు అన్ని వర్గాల వారిని మోసం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవృత్తి. ఇచ్చిన మాట నిలుపుకోకుండా ప్రజలను మోసం చేసే వ్యక్తి సీఎం సీటులో ఎలా కూర్చుంటారు. సిగ్గుండాలి..’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. ఇందులోభాగంగా మంగళవారం గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యాన సభ నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సభలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పుస్తకంలో 30వ పేజీలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఉద్యోగుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ‘మనిషి అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. దాన్ని నిలుపుకొనేందుకు పనిచేయాలి. కానీ, చంద్రబాబు మాత్రం ఉద్యోగులు మొదలుకుని రైతుల వరకు అన్ని వర్గాలను మోసంచేస్తున్నారు..’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆయన ప్రకటించారు. ‘మీకు మా పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. మీ సమస్యలపై గట్టిగా పోరాడుతోంది. మీరు కూడా పోరాడండి. అయినప్పటికీ చంద్రబాబుకు సిగ్గురాకపోతే నాలుగేళ్ల తర్వాత కచ్చితంగా మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు వెంటనే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం..’ అని కాంట్రాక్టు కార్మికులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. మీపక్షాన మేం నిలుస్తాం : వైఎస్సార్ సీపీ నేతలు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలుస్తామని శాసనసభలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు. చంద్రబాబు నిత్యం సింగపూర్ జపం చేస్తూ రాజధానిలో బహుళ అంతస్తులు, మెగా టవర్లు.. అంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సీఎంకు రాజధాని వ్యాపారం మినహా మరే విషయాలు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మడం వల్లే అందరికీ ఇటువంటి కష్టాలు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపన్న ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన రాష్ట్రాన్ని దత్తత తీసుకుంటే కనీసం కొంతమేలైనా జరిగేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు అందరినీ వంచిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ 18 వేల మంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను తక్షణమే క్రమబద్ధీకరిస్తామని, లేకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కేఎన్వీ సీతారామ్, కన్వీనర్లు పి.మధు, కాశీ, కో-కన్వీనర్లు ఆర్.ప్రవీణ్, మధుకుమార్, నాగరాజు, వైస్చైర్మన్లు ఎన్.శ్రీనివాస్, శివారెడ్డి, మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కరకట్ట నివాసితులకు అండగా ఉంటాం ‘కరకట్టపై నివాసం ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలంటే ఏలా. నివాసితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఖాళీ చేయించాలి..’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్‌చేశారు. మంగళవారం గుంటూరు నుంచి విజయవాడ వస్తున్న జగన్మోహన్రెడ్డిని కనకదుర్గ వారధి దాటిన తర్వాత రాణిగారితోట వద్ద స్థానికులు, మహిళలు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ ఉంటున్నామని, రెండు రోజుల్ల ఇళ్లు కూల్చివేస్తామని అధికారులు చెప్పారని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా పార్టీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్‌రెడ్డి మీకు అందుబాటులో ఉంటారు. వారు అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తారు..’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు. మూడు నెలలుగా పింఛను ఇవ్వడం లేదయ్యా.. ‘అయ్యా... మూడు నెలలుగా నాకు పింఛను రావడం లేదు. గతంలో చక్కగా ప్రతినెలా మొదటి వారంలో అందేది. ఇప్పుడు పింఛను తీసుకోవాలంటే నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది..’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద సీతన్నపేటకు చెందిన వృద్ధురాలు నడిపూడి కనకమ్మ కన్నీటిపర్యంతమైంది. జింఖానా గ్రౌండ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమె కలిశారు. తమ ప్రాంతంలో పింఛనుదా రులు పడుతున్న ఇబ్బందులను ఆమె వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛను ఇచ్చేవారని, ఇప్పుడు డబ్బులు పెంచినా సకాలంలో ఇవ్వకపోవడంతో తమకు సమస్యగా మారిందని ఆమె చెప్పారు. అందరికీ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. -
‘పట్టు’జారని విక్రమార్కుడు
అడ్డురాని వైకల్యం కరెంటు స్తంభాన్ని అవలీలగా ఎక్కేసిన లోవరెడ్డి ఉత్కంఠగా జూనియర్ లైన్‌మన్ ఎంపికలు విశాఖపట్నం : చెట్టులెక్క గలవా...ఓ నరహరి పుట్టలెక్కగలవా...అని ఏ అమ్మడూ ఆట పట్టించకుం డానే అతడు చకచకా స్తంభాలెక్కేశాడు. స్తంభాలెక్కడం ఏం విడ్డూరమా అనుకోవద్దు. లోవరాజు స్తంభాలెక్కడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక మానరు. ఎందుకంటే అతనికి ఓ కాలు లే దు. ఒంటికాలితో స్తంభాలెక్కడం ఎందుకంటారా... జూనియర్ లైన్‌మన్‌గా ఎంపిక కావడం కోసం...!..ఇవీ వివరాలు. రెండు కాళ్లూ చేతులూ బాగా పని చేసినా తాటి చెట్టంత స్తంభం ఎక్కడానికి అందరూ సాహసించలేరు. కానీ ఆ యువకుడు విధి వెక్కిరించి ప్రమాదంలో కాలు కోల్పోయినా సాహసంతో రెండు స్తంభాలెక్కేశాడు. విశాఖలోని గోపాలపట్నం ఏపీఈపీడీసీఎల్ క్వార్టర్స్ గ్రౌండ్లో మూడు రోజులుగా జరుగుతున్న జూనియర్ లైన్‌మన్ ఎంపిక లు శనివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీలకు యన్నమరెడ్డి లోవరెడ్డి అనే వికలాంగుడు హాజరవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అతన్ని చూసి తొలుత అధికారులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత తాను విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడినని చెప్పడంతో వెసులుబాటు ఇచ్చారు. అతనికి పరీక్ష పెట్టారు. తన కాలికి తగిలించుకున్న కృత్రిమ అవయవం తీసి లోవరెడ్డి చకచకా రెండు సార్లు రెండు రకాల స్తంభాలెక్కి దిగాడు. దీనిని చూసి అబ్బురపడిన చీఫ్ జనరల్ మేనేజర్ విజయలలిత, జీఎం వైఎస్ఎన్ ప్రసాద్ తదితరులు అభినందించారు. పోల్ ఎక్కి..కాలు కోల్పోయాడు... లోవరెడ్డి స్వస్థలం పాయకరావుపేట వద్ద కందిపూడి గ్రామం. ఇతని తండ్రి మంగిరెడ్డి నిరుపేద కూలీ. లోవరెడ్డి ఐటీఐ చదివాడు. ఐదేళ్ల క్రితం ఏపీఈపీడీసీఎల్‌లో పాయకరావుపేట రూరల్ సబ్‌స్టేషన్ పరిధి శ్రీరామపురం విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు కార్మికునిగా చేరాడు. రెండేళ్ల క్రితం అతను పోలెక్కి పని చేస్తుండగా, హఠాత్తుగా మంటలు చెలరేగి పోల్‌పైనే కాలు కోల్పోయాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కోలుకొన్నాక విద్యుత్ అధికారులు అతనికి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చారు. లోవరెడ్డి మాత్రం ఎప్పటికైనా తాను శాశ్వత ఉద్యోగం సంపాదించాలని ఆరాటపడ్డాడు. శనివారం అందరి కంటే తక్కువ సమయంలో స్తంభాలెక్కి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు.