all parties
-
AP MP: ఎంపీ సీట్లలో ఎవరికి ఎవరు పోటీ?
-
అన్ని పార్టీల సభ్యులు మేడిగడ్డకు రావాలి: శ్రీధర్ బాబు
-
సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు
-
ఢిల్లీ టు హైదరాబాద్..గరం గరం
-
పార్టీల లెక్కలు పార్టీవి..జనం లెక్కలు జనానివి
-
ఇంక 5 రోజులే..ప్రచారం స్పీడ్ పెంచిన పార్టీలు
-
ఇటు ఎన్నికల నగారా..అటు మేనిఫెస్టోల రగడ
-
సీఎం కేసీఆర్ పై ఈటల తీవ్రస్థాయిలో ఆరోపణలు
-
TS Election 2023: 'ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క..' పొలిటికల్ హీట్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ పోరు నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. వివిధ పార్టీల అగ్రనేతల రాకతో రాజకీయ సందడి నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఆయా పార్టీల ముఖ్య నాయకులు సభలతో ఎన్నికల శంఖారావం పూరించారు. గత ఆదివారానికి(అమావాస్య) ముందు మంచి రోజులు లేవు. దీంతో ప్రచార రథాలు సిద్ధమైనా బయటకు తీయలేదు. అడపాదడపా గ్రామాలకు వెళ్లడం మినహా సీరియస్‌గా ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు శ్రీకారం చుట్టలేదు. ఈ నెల 15 నుంచి మంచి రోజులు ప్రారంభమవడం, ఆరోజు నుంచే అగ్రనేతల పర్యటనలతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గల్లీల్లో డప్పుచప్పుళ్లతో, బతుకమ్మలు, బోనాలు, బైక్ ర్యాలీలతో ప్రచార స్పీడ్ పెంచారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న దరిమిలా.. కారు పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో రెండడుగులు ముందే ఉంది. బీజేపీ, హస్తం పార్టీలు దసరా తర్వాత మరింత దూకుడుగా వెళ్లనున్నాయి. కారుకు కంచుకోట.. అందరి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, బీఫాంలు అందజేసిన కారు పార్టీ ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. దీనికితోడు నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించింది. ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కారుకు కంచుకోట. ఈసారి పాత 12 స్థానాలతోపాటు చాలా కాలంగా ఊరిస్తున్న 13వ స్థానం కూడా దక్కించుకోవాలన్న ఫార్ములాతో ముందుకు సాగుతోంది. ఈసారి సీఎం కేసీఆర్ తొలి బహిరంగ సభను హుస్నాబాద్ కేంద్రంగా నిర్వహించి, ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలోనూ ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వచ్చ నెల మొదటి వారంలో సీఎం సభలను ధర్మపురి, కోరుట్ల, పెద్దపల్లి, మంథనిల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్‌లలో నిర్వహించిన ప్ర జాఆశీర్వాద సభతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠ! ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. గత గురువారం మొదటిరోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంథని, పెద్దపల్లి, కరీంనగర్లో రోడ్ షో, బహిరంగ సభ, పాదయాత్ర ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపారు. విజయభేరి యాత్రలో భాగంగా రెండో రోజు జగిత్యాల, కోరుట్ల కా ర్నర్ మీటింగ్‌లో ఆరు గ్యారెంటీలను వివరించారు. మిగిలిన ఏడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటిస్తే.. కాంగ్రెస్ ప్రచారం మరింత ఊపందుకోనుంది. బీజేపీ నాయకులు బిజీబిజీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ప్రకటన, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాని మోదీ రెండు సభల్లో పాల్గొన్ని, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హుజూరాబాద్ కేంద్రంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో కావాల్సిన సరంజామా సమకూర్చుకునే పనిలో బీజేపీ నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు. చదవండి: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు.. 13 శాఖలను గుర్తించిన ఈసీ.. -
Sakshi Cartoon: పోరు సంగతి తర్వాత ముందు ఆ శక్తి వాటికుందా కామ్రేడ్!
పోరు సంగతి తర్వాత ముందు లౌకిక శక్తులు ఏకం కాగల శక్తి వాటికుందా కామ్రేడ్! -
నేడు అన్ని పార్టీ ల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిసమావేశం
-
పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట చౌరస్తాలో బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, భాజపా నేత కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే అంబేడ్కర్ విగ్రహం తొలగించిన ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలు కొన్ని ప్రకటనలు చేసి దిద్దుబాటు చర్యలు తీçసుకోకపోవడాన్ని గవర్నర్‌కు తెలిపినట్లు చెప్పారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన స్థానంలోనే కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పోరాటాలను ఈ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందన్నారు. విగ్రహం కూల్చివేత వెనుక ఉన్న వారి పేర్లను బయటపెట్టి నిందితుల్ని జైలుకు పంపాలని కోరామని ఎల్.రమణ అన్నారు. -
నాటికీ.. నేటికీ మారిన ప్రచార తీరు
సాక్షి, వరంగల్ రూరల్: కాలం మారుతున్నా కొద్దీ ఎన్నికల ప్రచార శైలి మారుతూ వస్తోంది. ఒకప్పుడు చేతిరాతలు.. గోడ రాతలకే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యం నడుస్తోంది. ఆన్లైన్లోనే ప్రచారం చేపడుతున్నారు. అంతా ఆన్లైన్లో రాస్తున్నారు...స్వయంగా మాట్లాడుతున్నారు. కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులో వస్తున్నాయి. వాటిని వినియోగించుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో తక్కువ ఖర్చుతో ప్రచారం నిర్వహించగా ఇప్పుడు ఖరీదైపోయింది. 1952–62 మధ్య కాలంలో.. 1952లోదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. 1952–62 మధ్య కాలంలో ప్రచారం సాదాసీదాగా ఉండేది. ఆ తరం వారు నాటి ప్రచార తీరు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. ఇప్పుడు వింటే విస్తుపోవడం మన వంతు అవుతోంది. నాడు అభ్యర్థులు చేతి రాతతో ప్రచార పత్రాలు రూపొందించుకొనే వారు. అప్పట్లో చాలా మందికి గొలుసు కట్టు రాతలో ప్రావీణ్యం కలిగి ఉండేది. కార్బన్ పేపర్ వినియోగించి రాసేవారు. నిరక్ష్యరాసులు ఎక్కువ, కొద్దిపాటి చదువు వచ్చిన వారు గొలుసు కట్టు రాత చదవటం కష్టంగా ఉండేది. దీంతో వీటిని ఓటర్లకు చదివి వినిపించడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకునే వారు. 1967–78లో.. ప్రింటింగ్ ప్రెస్‌లు అందుబాటులోకి వచ్చాయి. కాగితాలపై రాసుకునే ప్రచార పత్రాలు కనుమరుగయ్యాయి. అభ్యర్థులు కరపత్రాల ముద్రణ వైపునకు దృష్టి సారించారు. వీటిని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేశారు. మరో పక్క ఎన్నికల గుర్తు, పార్టీ పేరు, అభ్యర్థి పేరు, ఫొటోతో ముద్రించిన వాల్‌పోస్టర్లను ఇళ్ల తలుపులపై అంటించేవారు. ఎన్నికల గుర్తులను తలుపు పక్కన గోడపై గుద్దేవారు. అభ్యర్థులు అన్ని ఊళ్లు తిరిగేవారు. గ్రామానికి వెళితే ఓటర్లను కలిసేవారు కాదు. గ్రామ పెద్దలు నలుగురైదుగురిని కలిసి ఎన్నికల వ్యూహరచన చేసేవారు. వారు క్షేత్రస్థాయిలో దానిని అమలు పరిచేవారు. ముఖ్య నాయకులు ఎవరైనా వచ్చి వెళ్లినా ఆ విషయం ఓటర్లకు పెద్దగా తెలిసేది కాదు. 1983–94లో రాజకీయ చైతన్యానికి నాంది పడింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరామారావు జనం మధ్యలోకి రావడం ప్రజలకు రాజకీయం అంటే ఏమిటో తెలిసొచ్చింది. ఊరూరా బ్యానర్లు, మైకులతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అభ్యర్థులతో అనుచరగణం రోడ్‌షోలు నిర్వహించేవారు. వారిని చూడటానికి రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులుదీరి నిలబడేవారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాల ముద్రణ ఉన్నా మైకుల హోరు ఎక్కువగా ఉండేది. ఎన్నికల నియమావళి గురించి పట్టించుకునే వారు అప్పట్లో చాలా తక్కువ మంది. 1999నుంచి డిజిటల్ రాజ్యం డిజిటల్ ఫ్లెక్సీల రాజ్యం మొదలైంది. పార్టీలు పోటాపోటీగా వీటిని ఏర్పాటు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ లేని జేబుల్ని వెతకడం కష్టంగా ఉండేది. ఇంటింటా ఫోన్లు ఉండడంతో గంపగుత్త సందేశాలు పంపడం సులభంగా మారింది. తమకు ఓటేయాలని గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ రూపొందించిన సందేశాలను పంపేవారు. పోటీలోని అభ్యర్థి నేరుగా ఓటర్లతో మాట్లాడే ప్రయత్నాలకు ఫోన్ మాధ్యమంగా నిలిచింది. ఫోన్ లేపగానే ‘నేను మీ నియోజవర్గ అభ్యర్థిని...నన్ను గెలిపించాలి’ అని ముందుగానే రికార్డు చేసిన మాటలు వినిపించేవి. గత ఎన్నికల ప్రచారంలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానం ఉరకలేసింది. జనం, కార్యకర్తలు గుమిగూడిన చోట ఉంచి తెరపై అగ్రనేత మాట్లాడే దృశ్యాలను నేరుగా చూపించారు. కాలం మారింది.. నగరం, పట్టణం, పల్లె ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇప్పుడు సామాజిక మాధ్యమాన్నే విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రాం తదితర సైట్లను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ప్రచారంలోని ప్రతి పదనిస క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. మద్దతుదారులు తమ ఫొటోలు, వీడియో పోస్టులతో హల్చల్ చేస్తుండటం విశేషం. అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉండటంతో వారి అనుచరులు 70 శాతం మంది సామాజిక మాధ్యమాలపై ఆధార పడుతున్నారు. ఈ విషయంలో ప్రధాన పార్టీలు ముందంజలో ఉంటున్నాయి. ఖరీదైన ఎన్నికలు తొలినాళ్లలో ఖర్చు నామమాత్రంగా ఉండేది. ప్రచార ఆర్భాటం తక్కువ ఉండటంతో ఖర్చు స్వల్పంగా ఉండేది. ఓటర్లు డబ్బులు అడిగే వారు కాదు. తర్వాతి ఎన్నికల నుంచి ఖర్చు పెరగడం ఆనవాయితీగా మారింది. 2004 ఎన్నికల నుంచి పరిస్థితి పూర్తిగా మారింది. ఖర్చు విపరీతంగా లక్షలకు పెరిగింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన పరిమితిని దాటి ఖర్చులు ఉంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు ఎన్ని రేట్లు జరుగుతుందనేది ఎవరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు. రూ.కోట్లలోనే జరుగుతుంది. ప్రచారం మొదలు ఓటు వేసే దాక ప్రతి చిన్న విషయానికి అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. -
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనుండగా, గెలుపోటములపై అభ్యర్థుల లెక్కలు మాత్రం తేలడం లేదు. గత ఎన్నికలతో పోలిస్తే 8.1శాతం మేర పోలింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందోననే కోణంలో రెండు రోజులుగా అభ్యర్థులు ఎడతెగని కసరత్తు చేస్తున్నారు. పురుషులతో పోటీగా మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉండడాన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ, గెలుపోటములపై అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 81.94శాతం పోలింగ్ నమోదైంది. 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 8.1శాతం ఓట్లు అదనంగా పోలయ్యాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా పెరగ్గా అందోలు నియోజకవర్గం పరిధిలో ఈ పెరుగుదల ఏకంగా 10.19శాతంగా నమోదు కావడం గమనార్హం. శుక్రవారం సాయంత్రం పోలింగ్ గడువు ముగిసిన మరుక్షణం నుంచే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బూత్‌ల వారీ ఓట్ల వివరాలు సేకరించారు. బూత్ స్థాయిలో తమకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉండే ఓట్ల సంఖ్యపై అభ్యర్థులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అయినా సంతృప్తి చెందని అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధిలో ఓ వైపు వివిధ వర్గాల నుంచి ఓటింగ్ సరళిపై వివరాలు సేకరిస్తూనే, విభిన్న కోణాల్లో పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా పోలింగ్‌కు సంబంధిం చిన మూడు అంశాలు పార్టీలు, అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడం, పురుష ఓటర్లకు దీటుగా మహిళలు పోలింగ్‌లో పాల్గొనడం, గ్రామీణ బూత్‌లలో పెరిగిన పోలింగ్ శాతంపై అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మూడు అంశాలు తమ ఫలితాన్ని ఎంత మేర ప్రభావితం చేస్తాయనే అంశంపై లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో పాటు పోలింగ్ బూత్ స్థాయిలో మద్యం, డబ్బు పంపిణీ ఎంత మేర ప్రభావం చూపుతుందనే కోణంలోనూ ఆయా పార్టీల నేతలు అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత? మహా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస తరఫున పోటీ చేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేసిందని లెక్కలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల వ్యక్తిగత పనితీరు తమకు భారీగా లాభిస్తుందనే అంచనాలో కూటమి అభ్యర్థులు కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలు, తెలంగాణవాదం, చేసిన పనితీరు, ప్రచారంలో సమన్వయం, భారీ బహిరంగ సభలు తమకు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నడుమ త్రిముఖ పోటీ జరిగినట్లు పోలింగ్ సరళి వెల్లడిస్తోంది. కొన్ని బూత్‌లలో టీఆర్ఎస్, కాంగ్రెస్, మరికొన్ని చోట్ల టీఆర్ఎస్, బీజేపీ నడుమ పోరుగా కనిపించింది. సుమారు 15వేల ఓటు బ్యాంకు కలిగిన టీడీపీ మహా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో, ఓటు బదిలీ ఎంత మేర జరిగిందనే అంశంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల రాజకీయ మనుగడకు ఎన్నికల ఫలితాలు గీటురాయి కానున్నాయి. అందోలు నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం, గత ఎన్నికలతో పోలిస్తే 10.19శాతం అదనంగా ఓట్లు పోలవడం టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ పోటీ చేసినా బూత్ స్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ నువ్వా నేనా అనే రీతిలో పోలింగ్ నడిచింది. మహిళా ఓటర్లు ఇక్కడ ఫలితాన్ని నిర్దేశించే సూచనలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ప్రధానంగా పోటీ సాగినా, బీజేపీ అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఝరాసంగం మినహా ఇతర మండలాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ పోటీ కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొగ్గు చూపిన యువత ఈసారి బీజేపీ వైపు మళ్లినట్లు కనిపిస్తుండడం, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై అభ్యర్థులు ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నా, గ్రామీణ బూత్‌లలో ఓటింగ్ శాతం పెరగడంతో టీఆర్ఎస్లో ధీమా కనిపిస్తోంది. సంగారెడ్డి పట్టణ ఓటర్ల నాడి అంతుబట్టక పోవడం కొంత ఉత్కంఠ రేపుతున్నా, మైనారిటీ ఓటర్లు ఎటు మొగ్గు చూపి ఉంటారనే అంశం కీలకంగా మారింది. క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఓ పార్టీకి అనుకూలంగా పోలవుతాయని భావించినా, ఆ మేరకు పడినట్లు కనిపించడం లేదు. పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రచార హడావుడి సృష్టించినా, చివరి నిమిషంలో టికెట్ ఖరారు కావడంతో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ కేంద్రీకృతమైంది. రామచంద్రాపురం, అమీన్పూర్ మండలాలు, పటాన్చెరు పట్టణ బూత్‌లతో ఇరు పార్టీల నడుమ గట్టి పోటీ కనిపించింది. -
తిరుగుబాటు బావుటా
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ రెండు పార్టీల టికెట్ ఆశించిన నాయకులు నామినేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లోనూ.. కాంగ్రెస్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్‌తో పాటు, మహేష్‌కుమార్‌గౌడ్, రత్నాకర్‌లు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు, పార్టీకి అందించిన సేవలు, సర్వే నివేదికల ఆధారంగా అధిష్టానం అర్బన్ టికెట్‌ను డీసీసీ అధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్‌కు ఖరారు చేసింది. దీంతో ఈ టికెట్ ఆశించిన రత్నాకర్ కూడా సోమవారం నామినేషన్ వేయడం జిల్లా కేంద్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను అర్బన్ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని ఆదివారం మీడియాకు రత్నాకర్ సమాచారం అందించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి సమయంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రత్నాకర్ నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోకి వెళ్లారు. పార్టీ అధిష్టానంతో పాటు, జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తాహెర్‌కు అందరివాడుగా పేరుంది. టికెట్ రేసులో ఉన్న మహేష్‌కుమార్‌గౌడ్ కూడా తాహెర్‌కు మద్దతు పలికారు. మహేష్ త్యాగం చేయడంతోనే తనకు అభ్యర్థిత్వం దక్కిందని తాహెర్ పేర్కొన్నారు. ఈ తరుణంలో రత్నాకర్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి షాక్. రెబల్స్ బెడద బీజేపీకి కూడా తప్పడం లేదు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ టికెట్ ఆశించిన ధన్పాల్ సూర్యనారాయణగుప్త సోమవారం నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ధన్పాల్ శివసేన టికెట్‌పై బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థి బెడద కొనసాగనుంది. అర్బన్ స్థానం బీజేపీ అభ్యర్థిత్వం మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణకు లభించింది. ఈ టికెట్ కోసం ధన్ పాల్ గట్టి ప్రయత్నాలు చేసి విఫలమయ్యా రు. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసిన ధన్పాల్ చివరకు పోటీ చేయాలని నిర్ణయించారు. నాయుడు ప్రకాశ్ సైతం నామినేషన్ జుక్కల్ బీజేపీ టికెట్ విషయంలో తనకు అన్యాయం చేశారని నిరసిస్తూ ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి నాయుడు ప్రకాష్ సైతం శనివారం నిజామాబాద్ అర్బన్ స్థానానికి నామినేషన్ వేసిన విషయం విదితమే. అయి తే నాయుడు ప్రకాష్‌కు బీజేపీ అధిష్టానం బా న్సువాడ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఆయన బాన్సువాడ స్థా నానికి కూడా నామినేషన్ వేశారు. అర్బన్ స్థానానికి ఆయన వేసిన నామినేషన్‌ను ఉప సంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నా యి. జిల్లాలో బీజేపీకి పట్టున్న స్థానాల్లో ఒకటైన నిజామాబాద్అర్బన్లో రెబల్ అభ్యర్థి బరిలోకి దిగడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇలా తిరుగుబాటు బావు టా ఎగురవేసిన అభ్యర్థులు పార్టీ బుజ్జగింపులకు తలొగ్గి నామినేషన్లను ఉపసంహరించుకుంటారా..? లేక బరిలో ఉంటారా..? అనే అంశం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 22 తర్వాతే తేలనుంది. -
అటెన్షన్..!
సాక్షి, కొత్తగూడెం : ఇప్పటికే జిల్లాలో ఎన్నికల వేడి రగిలింది. గత కొన్ని నెలలుగా ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయి. ప్రజాసమస్యలపై పలు దశల్లో పోరాటాలు చేస్తున్నాయి. గతంలో వామపక్షాలకే పరిమితమైన పోడుభూముల పోరాటాన్ని కాంగ్రెస్ తదితర పార్టీలు సైతం చేపట్టాయి. దీంతో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇక అందరూ ఊహించినట్లుగానే 9 నెలల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభను రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లో హైటెన్షన్ నెలకొంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అయితే అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు పోటీచేసే వారి పేర్లు వెలువడ్డాయి. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అప్పుడే హడావిడి మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు సిట్టింగ్‌లకు టికెట్లు రాగా, భద్రాచలం స్థానంలో తెల్లం వెంకట్రావుకు టికెట్ దక్కింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. అనేక చోట్ల ర్యాలీలు నిర్వహిస్తూ, బాణసంచా కాలుస్తూ జోష్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేసిన టీఆర్ఎస్.. శుక్రవారం కేసీఆర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ సభ ద్వారా సమరశంఖం పూరించనుంది. దీంతో జిల్లాలోనూ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయికి దూసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మకాం వేసిన విపక్ష నేతలు.. శాసనసభ రద్దు చేసిన మరుక్షణమే కేసీఆర్ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లకూ అభ్యర్థుల పేర్లు వెల్లడించడంతో విపక్షాల్లో మరింత హడావిడి మొదలైంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఆ కూటమిలో సీపీఐ, టీడీపీ, టీజేఎస్ పార్టీలు చేరే విషయం ఖాయం కావడంతో పాటు సీపీఎంను సైతం కలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయం కొంత క్లిష్టతరం కానుంది. దీంతో ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించే ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మకాం వేసి తమ తమ స్థాయిల్లో తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏ పార్టీకి ఏ స్థానాలు ఇస్తారు.. తమకు టికెట్లు వస్తాయా, రావా అనే గందరగోళంలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఉన్న కాంగ్రెస్ సీపీఎంను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఆ పార్టీ మాత్రం బీఎల్ఎఫ్(బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్) పేరుతో ఎన్నికలకు వెళతామని గట్టిగా చెబుతోంది. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సీపీఎం గుర్తుపై, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో బీఎల్ఎఫ్ గుర్తుతో పోటీ చేసేందుకు సీపీఎం సిద్ధమవుతోంది. ఇక దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణులు బూత్‌స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కొందరు తమకు టికెట్లు దక్కకపోతే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎంపీతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట శాసనసభ స్థా«నాల్లో గెలుపొందిన వైఎస్సార్సీపీ ఈసారి భద్రాద్రి జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. భద్రాద్రి జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలంగా ఉండగా, కాంగ్రెస్ కూటమిలో చేరనున్న టీడీపీ, సీపీఐ సైతం గణనీయమైన బలం కలిగి ఉన్నాయి. టీజేఎస్ సైతం కొంతమేరకు ప్రభావం పెంచుకుంటోంది. ఇక బీఎల్ఎఫ్ పేరుతో సీపీఎం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండగా, బీజేపీ, వైఎస్సార్సీపీ విడివిడిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో జిల్లాలో బహుముఖ పోటీ జరుగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘విభజన హామీలపై దమ్ముంటే చర్చకు రండి’
సాక్షి, విజయవాడ : కడప స్టీల్ ప్యాక్టరీ సాధన ఉద్యమం తీవ్రతరం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాల్సిందే అని అఖిలపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మించే వరకు ఉద్యమం ఆగదని వారు తెలపారు. ఉద్యమానికి సంఘీబావంగా సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, జనసేన, కాంగ్రెస్, ఆమ్ అద్మి పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల నేతలు విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్యాక్టరీ రాయలసీమ ప్రాంత ప్రజల సమస్య మాత్రమే కాదు.. అది రాష్ట్ర ప్రజల సమస్య అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ.. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మాణం చేపడతామని విభజన సమయంలో హామీ ఇచ్చారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు జరపాల్సిందేననని ఆయన పేర్కొన్నారు. ‘స్టీల్ ప్యాక్టరీ నిర్మాణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పటి సమస్య కాదు..13వ షెడ్యుల్‌లో పొందుపరిచిన అంశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. ఇప్పుడు టీడీపీ రాజకీయ నాటకం ఆడుతుందని’ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు 80 శాతం హామీలు అమలు జరిపామని చెబుతున్నారు. వారికి అసలు విభజన హామీలపై అవగాహన లేనట్లుందని విమర్శుల గుప్పించారు. బీజేపీ నేతలు మీడియా సమక్షంలో విభజన హామీలపై చర్చిద్దాం.. దమ్ముంటే చర్చకి రావాలని రామకృష్ణ సవాలు విసిరారు. టీడీపీ ప్రజలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 29వ తేదిన కడపలో జిల్లాలో జరిగే బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. అంతేకాక ఆ రోజు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. విద్యార్థులు ఉద్యమంలో పెద్దెత్తున పాల్గొనేలా ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, ఉత్తారాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ సాధించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్ బాబురావు స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. కడప జిల్లా బంద్‌కు పూర్తిగా సంఘీబావం ప్రకటిస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయన తెలిపారు. బీజేపీ, టీడీపీ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజలతో ఆటలాడితే తగిన బుద్ధి చెబుతామని బాబురావు హెచ్చరించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గతంలో జరిగిన ఉద్యమాన్ని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య గుర్తు చేశారు. అదే మాదిరి ప్రస్తుతం రాష్ట్రంలో కడప స్టీల్ ప్యాక్టరీ సాధన కోసం అలాగే ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. అనాడు 38మంది విద్యార్థుల ప్రాణత్యాగం చేశారు.. ఎటువంటి పోరాటానికైన మేము సిద్ధంగా ఉన్నామని ఈశ్వరయ్య అన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో నిరహరదీక్షలు కాదు.. ఢిల్లీలో దీక్షలు చేయాలని ఈశ్వరయ్య హితవు పలికారు. -
భగ్గుమన్న అసెంబ్లీ
భువనేశ్వర్ : జగన్నాథునిపట్ల జరుగుతున్న తప్పిదాల శీర్షికతో రాష్ట్ర శాసన సభ భగ్గుమంది. మంగళవారం ఈ విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర శాసన సభలో మలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం యథాతథంగా ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు స్పీకర్ ఆదేశించిన మరుక్షణమే సభలో వాతావరణం వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు భారతీయ జనతా పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు. ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని దేవస్థానంలో దైనందిన సేవాదుల్లో అవాంఛనీయ జాప్యం జరుగుతోంది. ఈ విచారకర పరిస్థితులు రాష్ట్రంతో పాటు ప్రప ంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జగన్నాథ స్వామి భక్తుల హృదయాల్ని కలిచి వేస్తున్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. సభ్యులు శాంతించి సభా కార్యక్రమాలకు సహకరించాలన్న స్పీకర్ అభ్యర్థనపట్ల స్పంద న కొరవడింది. ఈ పరిస్థితుల్లో సభా కార్యక్రమాల్ని ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రదీప్ కుమార్ ఆమత్ ప్రకటించారు. దీంతో మంగళవారం నిర్వహించాల్సిన ప్రశ్నోత్తరాలకు గండి పడింది. జీరో అవర్‌లోనూ అదేపరిస్థితి ప్రశ్నోత్తరాల తర్వాత నిర్వహించాల్సిన జీరో అవర్ సమావేశాలకు సభలో అనుకూల వాతావరణం కనిపించలేదు. శ్రీ మందిరంలో సేవల్లో జాప్యం పట్ల స్పీకర్ రూలింగ్ జారీ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దానికి స్పీకర్ నిరాకరించడంతో ప్రతిపక్షాల గోలతో సభా ప్రాంగణం మార్మోగింది. సభ్యుల్ని అదుపులోకి తెచ్చే పరిస్థితి లేనందున సభా కార్యక్రమాల్ని మరోసారి వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈసారి మధ్యాహ్నం 12.50 గంటల వరకు వాయిదా వేశారు. అప్పటికీ అదే పరిస్థితి కొనసాగడంతో తిరిగి మధ్యాహ్నం 3 గంటల వరకు సభా కార్యక్రమాల్ని నిరవధికంగా వాయిదా వేశారు. అత్యంత సున్నితమైన అంశంపట్ల ప్రభుత్వ వైఖరి సంతృప్తికరంగా లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేనట్లు ప్రతిపక్షాలు తెగేసి చెప్పడంతో సభా కార్యక్రమాల్ని ముందుకు నడపడం అసాధ్యంగా భావించిన స్పీకర్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. -
బంద్ ప్రశాంతం
సాక్షి,విశాఖసిటీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్‌తో అఖిలపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, ఏపీ హోదా సాధన సమితితోపాటు విద్యా, విద్యార్థి సంఘాలు, వాణిజ్య, వ్యాపార సంఘాలతో పాటు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌తో నగరంతో పాటు జిల్లా స్తంభించిపోయింది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుంచే రహదారులపైకి అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు వచ్చి నిరసనలు తెలిపారు. మద్దిలపాలెం జాతీయ రహదారిపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్నాథ్, నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ, సీపీఎం నగర కార్యదర్శి గంగారాం సహా వివిధ పార్టీల నేతలు పాల్గొని జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జగదాంబ జంక్షన్ వద్దకు చేరుకొని నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలు హోదా ర్యాలీ నిర్వహించారు. జగదాంబ జంక్షన్ నుంచి సరస్వతీ పార్క్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. దారిలో అక్కడక్కడా తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. డాబాగార్డెన్స్‌లోని బీఎస్ఎన్ఎల్, తపాలా కార్యాలయాలకు వెళ్లి.. ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరుతూ సంస్థలను మూయించివేశారు. జగదాంబ జంక్షన్లో వామపక్షాల ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శలు చేపట్టారు. గాజువాకలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నేతలు అర్థనగ్నప్రదర్శనలు నిర్వహించి బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాత గాజువాక జంక్షన్లో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించగా, వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలు పొర్లు దండాలు పెట్టారు. సీపీఎం, వైఎస్సార్సీపీ మహిళా ప్రతినిధులు రోడ్డుపైనే కబడ్డీ ఆడారు. సీపీఎం కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. భీమిలిలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం ఆరు గంటలనుంచే బస్సులు, ఆటోలు తిరగలేదు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తూ బంద్‌కు మద్దతు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలు, కార్యాలయాలు సెలవు ప్రకటించాయి. మెయిన్‌రోడ్డు గంటస్తంభం వద్ద వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావ్, ఇతర అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయనిర్మల, ఇతర పార్టీల ఆధ్వర్యంలో కొమ్మాది కూడలి, కార్ షెడ్ కూడలి, మధురవాడ, ప్రధాన వాణ్యి కూడలి వేమువలస జంక్షన్లో తదితర ప్రాంతాలలో దఫదఫాలుగా రాస్తారోకోలు నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్రామీణ వైద్యుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ చేపట్టింది. సింహాచలంలో ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ, దేవస్థానం పరిపాలనా కార్యాలయాన్ని ఆందోళనకారులు మూయించివేశారు. బస్సులు లేకపోవడంతో సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వెలవెలబోయింది. పెందుర్తిలో అన్ని పార్టీల శ్రేణులతో పాటు ఐద్వా తదితర ప్రజాసంఘాల నాయకులు రోడ్డెక్కి హోదాపై తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. పెందుర్తి కూడలి వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యార్థులు, మహిళలు, సామాన్యులు రోడ్లపై బైటాయించి ప్రత్యేకహోదా ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ దశలో పోలీసులు, ఆందోళనకారులకు మద్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు తగ్గకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. మరోవైపు బంద్‌ను విచ్చిన్నం చేసేందుకు టీడీపీ నాయకులు తెరచాటు ప్రయత్నాలు చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్తలు సత్తిరామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, సనపల చంద్రమౌళి ఆధ్వర్యంలో గురుద్వారా కూడలిలో రహదారుల దిగ్బంధనం చేశారు. ఊర్వశీ జంక్షన్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. మరోవైపు.. జిల్లా అంతటా బంద్ సందర్భంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ బంద్ విజయవంతమైంది. రాంబిల్లిలో రోడ్డుపై బైఠాయించిన అఖిలపక్ష నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. మునగపాకలోనూ పోలీసులు జులూం ప్రదర్శించారు. ఆందోళనకారుల్ని రోడ్డుపై నుంచి బలవంతంగా నెట్టేశారు. మాడుగుల నియోజకవర్గంలో బంద్ ఉద్రిక్తంగా మారింది. మాడుగులలో రోడ్డుఅడ్డంగా బంద్‌లో ప్రత్యేక హోదా నినాదాలు చేస్తుంటే ఎస్.ఐ ధనుంజయ్‌తో సిబ్బంది వైఎస్సార్సీపీ నాయకులు పెదబాబును, కొట్యాడలను బలవంతంగా తీసుకెళ్లారు. -
గన్నవరంలో రైతుల ఆందోళన..
సాక్షి, కృష్ణా: గన్నవరం మండలం బుద్ధవరం వద్ద రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. గన్నవరం విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న రైతులకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. భూమికి పరిహారం చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. గన్నవరం- మనికొండ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
‘కార్మికుల సమస్యపై చంద్రబాబు నిర్లక్ష్యం..’
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అంతేకాక కాంట్రాక్టు ఉద్యోగులవి న్యాయమైన కోరికలని తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హమీలను అమలు చెయ్యాలని అఖిలపక్షం పేర్కొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, జనసేన ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనకు మద్దతును ప్రకటించాయి. వారి సమస్యలను వెంటనే పరిష్కరించబోతే అన్ని పార్టీలు కలిసి ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించాయి. విద్యుత్ కార్మికుల సమస్యపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్షం ధ్వజమెత్తింది. వారి పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరు మంచిదికాదు.. తక్షణమై విద్యుత్ కార్మికులను పిలిచి సంప్రదింపులు జరపాలని సూచించాయి. కార్మికుల ఓర్పుని పరిక్షిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అఖిలపక్షం తెలిపింది. రేపు(ఫిబ్రవరి 23న) 13 జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ ధర్నాలకు దిగుతామని అన్నిపార్టీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. -
‘ఒకే ఎజెండాతో పోరాడాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం మార్చి 4న(ఆదివారం) విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సాయంత్రం 6గంటలకు కొవ్వొత్తులతో తెలిపే నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర చర్చవేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భరంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలు నాలుగేళ్లు గడుస్తున్నఅమలుకు నోచుకోని విషయం మనందరీకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హక్కులు కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2014లో రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి ఆచరణలో లేవన్నారు. మనకు ఇచ్చిన హామీలపై నిర్ధిష్టమైన కార్యచరణతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా నష్టపోతుందని కొణతాల పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఎక్కవగా నష్టపోతారన్నారు. ఈ తరుణంలో జెండాలు పక్కనపెట్టి, ఏకైక ఎజెండాతో సమిష్టిగా పోరాడని పక్షంలో భావితరాలు మనల్ని క్షమించవు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు, స్వఛ్చంధ సంస్థలు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కవులు, కళాకారులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, న్యాయవాదులందరూ పాల్గొన్నాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. -
ఖమ్మం బంద్‌కు మిశ్రమ స్పందన
-
కార్పొరేషన్ అవినీతిపై ఆందోళన
= వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్ణయం = రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు : మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజం అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని అఖిలపక్ష నేతలు తెలిపారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ అవినీతి కారణంగా నగర పాలక సంస్థ నవ్వులపాలు అవుతోందన్నారు. దీనిపై ప్రముఖ దినపత్రికలలో వార్తా కథనాలు వస్తున్నా వారి తీరులో ఎటువంటి మార్పూ లేదన్నారు. గడిచిన మూడేళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఉద్యోగులపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్నారన్నారు. కార్పొరేటర్లే కాంట్రాక్టర్లుగా మారి అవినీతి చేస్తున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పాలకవర్గం గ్రూపులుగా విడిపోయి ‘మూడు ముక్కలాట’ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి పనిలోనూ ఒక వర్గం చేపట్టాలని, మరో వర్గం వద్దంటూ అభివృధ్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అవినీతిలో అందరూ భాగస్వాములుగా మారారని దుయ్యబట్టారు. అధికారులను నిర్బంధించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్నారు. మేయర్ సమక్షంలోనే ఉన్నతాధికారిపై దాడి జరిగిందనే వాస్తవం తెలుస్తోందని, ఇలాంటి చర్యల ద్వారా నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ మేయర్ రాగే పరశురాం మాట్లాడుతూ నేడు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నగర పాలక సంస్థ అవినీతి అక్రమాలపైనే ప్రధాన చర్చ నడుస్తోందన్నారు. పాలకవర్గం అనుసరిస్తున్న తీరుతో కార్పొరేషన్ మొత్తం దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.15 కోట్ల నిధులను డ్రా చేశారన్నారు. వారికి ప్రజలు, మీడియా, విజిలెన్స్ అంటే భయం లేకుండా పోయిందన్నారు. కమిషనర్‌పై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను మేయర్, ఎమ్మెల్యే ఖండించినప్పటికీ ఈ విషయంలో అసలు దొంగలు ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ కార్పొరేషన్ లో పెత్తందారీ వ్యవస్థ రాజ్యమేలుతోందన్నారు. సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ కొన్ని నెలల వ్యవధిలోనే ఏడుగురు కమిషనర్లు బదిలీపై వెళ్లిపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. డివైడర్ల పేరుతో రూ.43 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సీపీఎం మొదటి జోన్ కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నగర పాలక సంస్థ విచ్ఛలవిడి తనానికి అడ్డాగా మారిందన్నారు. ఈ అవినీతిలో సీఎంకూ భాగముందని ఆరోపించారు. కార్పొరేటర్ జానకి మాట్లాడుతూ కార్పొరేషన్ అవినీతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు విన్నవించినా వారు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పైగా కార్పొరేటర్లపై అక్రమ కేసుల ను బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ అవినీతిపై మంగళ వారం అఖి లపక్షం ఆధ్వర్యంలో విచారిస్తామని నేతలు తెలిపారు. విచారణ అనంతరం నగరపాలక సంస్థ కార్యాల యం ముందు మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున, సరోజమ్మ, బాలాంజినేయులు, గిరిజమ్మ, పక్కీరమ్మ, వెంకటరమణమ్మ, పోతులయ్య పాల్గొన్నారు. -
చేబర్తికి నిధుల మంజూరుపై హర్షం
జగదేవ్‌పూర్: మండలంలోని చేబర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోట్లాది నిధులు మంజూరు చేయడం పట్ల సోమవారం గ్రామంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు నర్సింలుగౌడ్, రాందాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని చేబర్తి గ్రామం చాలా రోజులుగా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. చెబర్తి పెద్ద చెరువు నుంచే కూడవెల్లి వాగు పుట్టిందని, కానీ చేబర్తి వాగుకు బదులు కూడవెల్లి వాగు అనడంతో గ్రామంలో అభివృద్ధి కూడా అంతగా లేదన్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు కోట్లాది నిధులు మంజూరు చేశారని చెప్పారు. కూడవెల్లి వాగుకు బదులు పెద్దవాగుగా నామకరణం చేయడంతోపాటు చెరువు అభివృద్ధి కోటి రూపాయలు మంజూరు చేయడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా భవనం, ఫంక్షన్‌హాల్, బస్‌షెల్టర్, సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేయడంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అందరు కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములవుతామని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు రాములు, మల్లేశం, గంగాధర్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
మహాధర్నాకు వివిధ పార్టీల మద్దుతు
-
హోదా కోసం పార్టీలన్నీ కలిసి పోరాడాలి
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు టౌన్ : ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఒకే వేదికపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే కేంద్రం దిగివస్తుందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు అవకాశవాదంగా వెళితే రాష్ట్రం విడిపోయే విషయంలో ఏ విధమైన నష్టం జరిగిందో అదే మళ్లీ పునరావృతం అవుతుందన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం కలిసి పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేక యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి అధికారంలోకి వచ్చాక మాటమార్చడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ శేషుబాబు చెప్పారు. -
కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి
కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో ఉన్న కేతేపల్లి మండలాన్ని ప్రతిపాదిత సూర్యాపేట జిల్లాలో కలిపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మండలాన్ని సూర్యాపేట జిల్లాలో విలీనం చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చేందుకు మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కేతేపల్లిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమంలో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున ప్రజలతో నల్లగొండకు వెళ్లి జిల్లా కలెక్టరేట్‌కు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. ఈ ఉద్యమానికి మండల ప్రజలు, మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన జె.వెంకటనర్సయ్యయాదవ్, కోట మల్లికార్జునరావు, కోట పుల్లయ్య, కె.ప్రదీప్‌రెడ్డి, ఎ.జోగిరెడ్డి, కోట లింగయ్య, చందా రామ్మూర్తి, బి.జాన్‌రెడ్డి, కోట సంపత్‌రావు, ఎన్.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
- ప్రజాభిప్రాయాన్ని గౌరవించక పోవడం విడ్డూరం - అంగీకారం తెలిపిన ప్రజాప్రతినిధులు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ - జిల్లా సాధన సమితి, అఖిలపక్షం రాస్తారోకో చేవెళ్ల: పార్లమెంటు నియోజక వర్గ కేంద్రమైన చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపైనున్న మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ ఎదుట శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేవెళ్ల నియోజకవర్గాన్ని వికారాబాద్‌లో కలుపుతూ ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా పశ్చిమంలో ఉన్న వికారాబాద్‌లో కలపడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలోని మండలాలను వికారాబాద్‌లో కలిపితే పాలనా సౌలభ్యం ప్రజలకా, అధికారులకా, ప్రజాప్రతినిధులకా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలే జిల్లా కేంద్రాలుగా ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. తమ ప్రాంతాన్ని వికారాబాద్‌లో కలిపినా ఈ నియోజకవర్గానికే చెందిన మంత్రి, జెడ్పీ చైర్పర్సన్, ప్రజాప్రతినిధులు కిమ్మనకుండా మౌనంగా ఉండడంలో ఆంతర్యమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్లను వికారాబాద్‌లో కలపడానికి అంగీకారం తెలిపితే బహిరంగ ప్రకటనలు చేయాలన్నారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం నెలరోజులు గడువు ఇచ్చినందున చేవెళ్ల నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని రాస్తారోకో విరమింపజేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయపు ఏఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పలుపార్టీల అఖిలపక్ష నాయకులు ప్రభులింగం, రామస్వామి, పాండుయాదవ్, టేకులపల్లి శ్రీనివాస్, సుధాకర్, దామోదర్, గోపాల్‌రెడ్డి, బాలయ్య, అబ్ధుల్‌ఘనీ, హైమద్, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు -
షాబాద్ మండలాన్నిశంషాబాద్ జిల్లాలో కలపాలి
షాబాద్: షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేవరకు అఖిలపక్షం ఆధర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ఎ.రవీందర్‌రెడ్డి, బీసీ సేన రాష్ర్ట అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్అండ్బి అథితి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేంత వరకు బంద్ ప్రకటిస్తామన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరహార దీక్షలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను మూసివేయిస్తామన్నారు. షాబాద్ మండల ప్రాంతం శంషాబాద్ కు 30 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. నిత్యం విద్యా, ఉద్యోగంకోసం శంషాబాద్‌కు ఎక్కువగా వెళ్తుంటారన్నారు. రైతులు ప్రతిరోజు శంషాబాద్ మార్కెట్‌కు నిత్యం కూరగాయలు, నిత్యవసర వస్తువుల కోసం వెళ్తుంటారని తెలిపారు. షాబాద్‌ను వికారాబాద్ జిల్లాల్లో కలిపితే పెద్దెత్తున ఉద్యమం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మంగలి శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షులు అంజనేయులుగౌడ్, బీజేపీ నాయకులు రాము, నరేందర్‌రెడ్డి, సర్పంచులు రవీందర్ నాయక్, శివకుమార్, మద్దూర్ మల్లేష్, కాంగెస్ నాయకులు తమ్మళి రవీందర్, అష్మత్ పాష, జనార్దన్‌రెడ్డి, పామెన నర్సింలు, మల్లేష్, జంగయ్య, మాణిక్యప్రభు, అఖిల పక్షం నాయకులు కర్రె శ్రీశైలం, హరిశంకర్, కిరన్, రాపోల్ నర్సింలు, మల్లేష్, శివకుమార్, తదితరులున్నారు. ప్రతాప్‌రెడ్డి, తదితరులున్నారు. -
ఎత్తిపోతల పథకమే జీవనాధారం
ప్రాణాలు ఫణంగా పెట్టయినా సాధించుకుంటాం మహాపాదయాత్రలో అఖిలపక్ష నేతల వెల్లడి దామర గిద్ద: చితికిన రైతన్నల బతకులు బాగు పడాలంటే, చెరువులు నిండి బోరుబావుల్లో నీళ్లు పెరిగి పంటలు పండాలంటే కొడంగల్– నారాయణపేట ఎత్తిపోతల పథకమే శరణ్యమని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ఎత్తిపోతల పథకం సాధనం కోసం ఈనెల 22న మక్తల్ నుంచి ప్రారంభించిన మహాపాదయాత్ర బుధవారం ఐదవ రోజు దామరగిద్దకు చేరింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు పక్కనే ఉన్న జలాలను వదిలిపెట్టి ఎక్కడో 150కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని అందించడమంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందమే అన్నారు. సాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. లక్షలాది మంది ప్రజలు అభీష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఆగస్టు 1వ తేదీ నాటికి ఈ పాదయాత్ర జిల్లాకేంద్రానికి చేరుకునేలోపు ప్రభుత్వం జీఓనం.69 అమలుపై స్పష్టమైన ప్రకటన చేసితీరాలన్నారు. లేనిపక్షంలో అదే వేదికపై నుంచి మరో ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. జిల్లాకేంద్రంలో జరిగే మహా బహిరంగసభకు పల్లెపల్లె నుంచి వేలాదిగా కదిలొచ్చి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని తమ్మినేని విజ్ఞప్తిచేశారు. సీడీ ఆవిస్కరణ ఎత్తిపోతల సాధన ఉద్యమ ప్రాధాన్యతను తెలియజేస్తూ.. రైతుల కష్టాలు, గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ రచయితలు లక్ష్మిసాల్మాన్ రూపొందించిన గేయాల సీడీని ఆఖిలపక్ష నాయకులు విడుదల చేశారు. పాదయాత్రలో బీజేపీ నేత నాగురావు నామాజీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దయాకర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు, టీఎన్జీఓ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పేట నియోజకవర్గ ఇన్చార్జ్ సరాఫ్ కష్ణ, కష్ణా జలసాధన డివిజన్ కమిటీ కన్వీనర్ అనంత్‌రెడ్డి, సీఐటీ యూ రాష్ట్ర నాయకులు భూపాల్ ప్రసంగించారు. -
రేపు తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ఆదివారం జరగనుంది. ఈ నెల 30, 31న అసెంబ్లీలో చర్చించాల్సిన ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. కొత్త విద్యావిధానం, కరవుపై చర్చ, ఇరిగేషన్ ప్రాజెక్టు, తదితర అంశాలపై సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత చర్చించాల్సిన అంశాలపై బీఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
మోగింది రణభేరి
-
మోగింది రణభేరి
► ఫిబ్రవరి 2న ‘గ్రేటర్’ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల ► డివిజన్ల రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ ► కొద్దిసేపటికే షెడ్యూల్ ప్రకటన.. అమల్లోకి కోడ్ ► 12న ఎన్నికల ప్రకటన.. ► 17 వరకు నామినేషన్ల స్వీకరణ ► 18న పరిశీలన.. 21 వరకు ఉపసంహరణ గడువు ► అనంతరం తుది జాబితా, ఎన్నికల గుర్తుల ప్రకటన ► ఫిబ్రవరి 2న పోలింగ్.. 5న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ► 74 లక్షల మంది ఓటర్లు.. 7,757 పోలింగ్ కేంద్రాలు ► ఎన్నికల విధులకు 46,545 మంది అధికారులు, సిబ్బంది సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వ వ్యూహాలు, హైకోర్టు జోక్యం, హడావుడి మధ్య శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అంతకు కేవలం గంటన్నర ముందే (మధ్యాహ్నం మూడున్నర సమయంలో) డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈ ఎన్నికలకు 12వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 2న ఎన్నికలు జరుగుతాయి, 5వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. అమల్లోకి ఎన్నికల కోడ్ జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి బి.జనార్దన్‌రెడ్డితో కలసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికలను పూర్తిచేయాలని, ఒక్కరోజు సైతం వృధా చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో తక్షణమే షెడ్యూల్‌ను విడుదల చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన మూడు రోజుల వ్యవధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం... జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమ డివిజన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 12వ తేదీన ప్రకటన జారీ చేస్తారు. అదే రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ స్వీకరణ జరుగుతుంది. భోగి, సంక్రాంతి సెలవులైన 14, 15వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు విరామం ఇవ్వనున్నారు. 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుపుతారు. అనంతరం 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఈ గడువు ముగిసిన వెంటనే (3 గంటల తర్వాత) అభ్యర్థుల తుది జాబితాను, వారి ఎన్నికల గుర్తులను ప్రకటిస్తారు. వచ్చే నెల 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఎక్కడైనా అవసరమైతే 4వ తేదీన రీపోలింగ్ జరుపుతారు. 5న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వెనువెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. సుమారు 74 లక్షల మంది ఓటర్లు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 70,67,934 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వారికి అదనంగా ఓటరు నమోదు కోసం వచ్చిన 4,42,712 దరఖాస్తుల్లో అర్హత గల 3,46,999 దరఖాస్తులను ఎంపిక చేశారు. అంటే మొత్తంగా ఓటర్ల సంఖ్య 74 లక్షలు దాటిపోనుంది. గ్రేటర్ ఓటర్ల మూడో అనుబంధ జాబితాలో ఈ కొత్త ఓటర్ల వివరాలను ప్రచురిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటేసేందుకూ అవకాశం కల్పిస్తున్నారు. చివరిసారిగా 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 43 శాతం పోలింగ్ నమోదైంది. దాంతో పోలింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ కేంద్రాన్ని సులభంగా కనుక్కునే విధంగా ఎన్నికల జాబితాను రూపొందించామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి సైతం ఓటర్లు తమ ఓటు, పోలింగ్ కేంద్రం వివరాల గల ‘ఓటరు రసీదు’ ప్రతిని పొందవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు 7,757 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని... స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటును ఎన్నికల యంత్రాంగం పరిశీలిస్తోందని తెలిపారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలోనే పోలింగ్ స్టేషన్ ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లలో చైతన్యం నింపేందుకు భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవీఎంలతో ఎన్నికలు.. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను వినియోగించనున్నారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, చిహ్నాలు ఉంటాయి. అభ్యర్థుల ఫోటోలను ముద్రించడం లేదు. ఒకే చోట 64 మంది వరకూ పోటీలో ఉన్నా.. ఈవీఎంలను వినియోగించవచ్చు. అభ్యర్థులు అంతకు మించితే పేపర్ బ్యాలెట్ వినియోగించాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా (పైవారెవరూ కాదు)’ ఆప్షన్‌ను ఎంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారమే సూచనలు అందాయని, ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో 46,745 మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. అందులో 775 మంది పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు 7,757, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 7,787, అదనపు ప్రిసైడింగ్ అధికారులు 23,271 మంది ఉండనున్నారు. వీరికి అదనంగా 7,760 మంది పోలింగ్ సిబ్బందిని రిజర్వుడ్‌గా అందుబాటులో ఉంచనున్నారు. ‘బీసీ’ స్థానాల్లో పోటీకి ముస్లింలకు అవకాశం! బీసీల్లో ‘ఏ, బీ, సీ, డీ, ఈ’ వంటి వర్గీకరణలతో సంబంధం లేకుండా కుల ధ్రువీకరణ పత్రం గల వారందరికీ బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ‘బీసీ-ఈ’ కేటగిరీలోని ముస్లిం అభ్యర్థులకు బీసీ రిజర్వు స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారా అని ప్రశ్నించగా.. ఈ సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉండడంతో ఈ అంశం కీలకంగా మారనుంది. ఇక హైదరాబాద్ నగరవ్యాప్తంగా అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగిస్తామని నాగిరెడ్డి చెప్పారు. జీహెచ్ఎంసీ, స్థానిక ప్రైవేటు ఆస్తి యజమాని అనుమతితో ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మెట్రో రైలు పిల్లర్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలనే తామూ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల తేదీలివీ.. ఎన్నికల ప్రకటన : ఈ నెల 12 (మంగళవారం) నామినేషన్ల స్వీకరణ : 12 నుంచి 17వ తేదీ వరకు (ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు - సెలవుల నేపథ్యంలో 14, 15వ తేదీల్లో విరామం) నామినేషన్ల పరిశీలన : 18వ తేదీ ఉదయం 11 నుంచి.. ఉపసంహరణకు గడువు : 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల తుది జాబితా, ఎన్నికల గుర్తుల కేటాయింపు: 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోలింగ్ : ఫిబ్రవరి 2న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్ (అవసరమైతే) : ఫిబ్రవరి 4న ఓట్ల లెక్కింపు : ఫిబ్రవరి 5న ఉదయం 8 నుంచి.. (ఈ ప్రక్రియ ముగిసిన మూడు రోజుల్లోగా (ఫిబ్రవరి 8లోగా) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక ప్రకటన జారీ) -
గ్రేటర్ పీఠం కోసం గ్ర్రేటర్ కసరత్తు
-
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీల కసరత్తు
-
చంద్రబాబు సమాధానం చెప్పాలి
అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై అన్నిపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బాహాటంగా చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై అనంత సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా లంచాలు తీసుకుంటున్నామని చెప్పినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అవినీతి రహిత పాలన చేస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ పార్టీ ఇప్పుడు ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. జేసీ మాటలు ప్రజస్వామ్యానికి సిగ్గుచేటు అని.. ఆయన మాటలను న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని కోరారు. -
బిల్లు సభలో ప్రవేశపెట్టినట్టా?..పెట్టనట్టా?
న్యూఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం చెబుతున్నాయి. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు తాము అంగీకరించబోమని స్పష్టం చేశాయి. బిల్లు సభలో ప్రవేశపెట్టినట్లా?...ప్రవేశపెట్టనట్టా? అనే అంశంపై ఓటింగ్ పెట్టాలని విపక్షాలు స్పీకర్ మీరాకుమార్‌కు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు దీనిపై ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు డివిజన్ కోరాయి. -
‘లోక్‌పాల్’ ఆమోదానికి సహకరించండి: రాహుల్ గాంధీ
లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అవినీతిపై లోక్‌పాల్ వ్యవస్థ పోరు సాగించేందుకు వీలుగా అన్ని పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు సంపూర్ణ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై శనివారం ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, చిదంబరం, వి. నారాయణసామిలతో కలిసి రాహుల్ మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష ఒత్తిడి ఫలితంగానే ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదానికి ముందుకొచ్చిందన్న వాదనను రాహుల్ తోసిపుచ్చారు. ‘దేశానికి పటిష్ట లోక్‌పాల్‌ను అందించడమే మా ఉద్దేశం. ఈ దిశగా 99 శాతం ప్రయత్నం జరిగింది. ఇంకొక్క శాతం సహకారం ఇతర పార్టీల నుంచి అవసరం. దేశ ప్రయోజనాలతో ముడిపడిన ఈ బిల్లుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలనూ కోరుతున్నా’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదానికి మద్దతు కూడగట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపట్ల హజారే సంతృప్తి వ్యక్తం చేస్తారా? అని ప్రశ్నించగా దేశంలో అవినీతి వ్యతిరేక వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ఉద్దేశమని...ఆ దిశగా చర్యలు చేపడుతూనే ఉంటామన్నారు. బిల్లును సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యతిరేకిస్తున్న అంశాన్ని ప్రస్తావించగా చిదంబరం స్పందిస్తూ బిల్లు విషయంలో ఒకటి, రెండు పార్టీలకు అనుమానాలు ఉండొచ్చని, కానీ ఇప్పటివరకూ ఏ పార్టీ కూడా లోక్‌పాల్ వద్దని చెప్పలేదన్నారు. చర్చ లేకున్నా బిల్లు ఆమోదానికి సిద్ధం: బీజేపీ సెలెక్ట్ కమిటీ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరగకపోయినా దాని ఆమోదానికి సిద్ధంగా ఉన్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ‘ట్వీట్’ చేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ ఈ అంశంపై స్పందిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మరోవైపు లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలన్న రాహుల్ సూచనను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తోసిపుచ్చింది. బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకొని తీరతామని...ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తామని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, బిల్లును రాజ్యసభ ఆమోదించడంతోపాటు లోక్‌సభ కూడా ఆమోదముద్ర వేసి బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే తాను చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను విరమిస్తానని శనివారం రాలెగావ్ సిద్ధిలో తెలిపారు. -
అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్షం: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై అభిప్రాయాలు పంపాలని ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పక్షాలకు హొం శాఖ లేఖలు పంపింది. తెలంగాణపై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం(జిఎంఓ) విధివిధానాలపై అభిప్రాయాలు పంపాలని ఆ లేఖలలో పేర్కొన్నారు. నవంబర్ 5కల్లా అభిప్రాయాలు పంపాలని హొం శాఖ విజ్ఞప్తి చేసింది. 7వ తేదీన జిఎంఓ సమావేశం కానున్నందున, ఆ లోపలే అభిప్రాయాలు పంపాలని హొం శాఖ కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు పంపిన తరువాత అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు షిండే నిన్న చెప్పారు. జిఎంఓ సమావేరశానికి ముందే సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. మళ్లీ ఈరోజు వారి అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
'తప్పని పరిస్థితుల్లోనే ఎంపీల సస్పెన్షన్'
ఢిల్లీ: తప్పనిసరి పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించాకే ఎంపీలపై సస్పెన్షన్ వేటువేసినట్లు తెలిపారు. 15 రోజులుగా 10 మంది ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేయడం భావ్యం కాదన్నారు. ఎంపీల ఆందోళన కారణంగా సభా కార్యక్రమాలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. సస్పెన్షన్‌పై చర్చించేందుకే స్పీకర్ రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం కాంగ్రెస్ ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదన్నారు. రాజధాని, జలవనరులు, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణకు ఇది సరైన సమయం కాదన్న బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు సరికావన్నారు.