అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై అన్నిపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బాహాటంగా చెప్పిన విషయం తెలిసిందే.
దీనిపై అనంత సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా లంచాలు తీసుకుంటున్నామని చెప్పినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అవినీతి రహిత పాలన చేస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ పార్టీ ఇప్పుడు ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. జేసీ మాటలు ప్రజస్వామ్యానికి సిగ్గుచేటు అని.. ఆయన మాటలను న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని కోరారు.