
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలింది. జేసీ తీరుపై అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడానికి అనంతపురం టీడీపీ నాయకులు సిద్దమయ్యారు. జేసీ ఆధిపత్యాన్ని టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో జేసీ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సీరియస్ అయిన విషయం తెలిసిందే. జేసీ బూతులు తిడుతున్నా చంద్రబాబు మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మౌనం వల్లే జేసీ రెచ్చిపోతున్నారని పార్టీలోని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీ నోటి దురుసు కారణంగానే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment